Mp asaduddin owaisi gets bail

mim chief asaduddin owaisi, mp asaduddin owaisi gets bail, 2005 case, akbakuddin owaisi, medak district jail, sangareddy

MP Asaduddin Owaisi gets bail

MP Asaduddin.gif

Posted: 01/24/2013 05:51 PM IST
Mp asaduddin owaisi gets bail

MP Asaduddin Owaisi gets bail

ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి సంగారెడ్డి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. వరుసుగా రెండు సార్లు ఆయన బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. 2005లో ఓ ప్రార్ధనామందిరం వ్యవహారంలో అసదుద్దీన్‌, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌లు నాటి మెదక్‌ జిల్లా కలెక్టర్‌ అనిల్‌, జేసీలను దూషించారు. కలెక్టర్‌ను నెట్టివేశారు. దీనిపై నాడు మెదక్‌ ఎమ్మార్వో నరేందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కొంతకాలం పాటు అసద్‌, అక్బరుద్దీన్‌లు కోర్టుకు హాజరయ్యారు.అనంతరం కోర్టుకు గైర్హాజరు అయ్యారు. దీంతో కోర్టు వారిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. అక్బరుద్దీన్‌ అనుచిత వ్యాఖ్యల అనంతరం ఈ కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. దీంతో నాలుగు రోజుల క్రితం అసదుద్దీన్‌ సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. వెంటనే బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ అతడి బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. అసదుద్దీన్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మళ్లీ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ, కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో అసదుద్దీన్‌ను విడుదల చేయాలనికోరుతూ మెదక్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ల బంద్‌కు ఎంఐఎం కూడా పిలుపునిచ్చింది. పలు అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తిరిగి బెయిల్‌ కోసం అసదుద్దీన్‌న్ తరుపు న్యాయవాది రఘునందన్‌రావు సంగారెడ్డి కోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను మన్నించిన కోర్టు అసదుద్దీన్‌ కు బెయిల్‌ మంజూరు చేసింది. కొన్ని షరతులు కూడా విధించింది. రూ.10 వేల చొప్పున ఇద్దరిపూచీకత్తు ఇవ్వాలని కోర్టు అసద్‌ను ఆదేశించింది. అసద్‌కు బెయిల్‌ రావడంతో ఎంఐఎం కార్యకర్తల్లో హర్షతిరేకం వ్యక్తమవుతోంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు అసద్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. బెయిల్‌ ఆర్డర్‌ సకాలంలో అందకపోతే, రేపే అసదుద్దీన్‌ విడుదలవుతారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra hc rejects jagan bail plea
Bjp organises dharna fast against shinde hindu terror remarks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles