Railway minister pawan bansal announces hike in railway fares

railway minister pawan kumar bansal, pawan kumar bansal, announced a hike in passenger fare, increase in fares, second class fares

Railway Minister Pawan Bansal announces hike in railway fares

Railway Minister Pawan Bansal.gif

Posted: 01/09/2013 05:12 PM IST
Railway minister pawan bansal announces hike in railway fares

Railway Minister Pawan Bansal announces hike in railway fares

కరెంట్ ఛార్జీలు, బస్సు ఛార్జీలలతో పాటు  రైల్వే ఛార్జీలు పెరుగుతున్నాయి. ఈ నెల 21 నుంచి రైలు ఛార్జీలు పెంచుతున్నట్లు రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్స ల్ చెప్పారు. పదేళ్ల తరువాత రైలు చార్జీలు పెరుగనున్నాయి. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైల్వేలు తీవ్ర నష్టాలలో ఉన్నందున రైలు చార్జీలు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని తరగతులకు 20 శాతం ఛార్జీలను పెంచుతున్నట్లు చెప్పారు. చార్జీల పెంపుతో రైల్వేలకు 12వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. స్లీపర్ క్లాస్‑కు కిలో మీటర్‑కు ఆరు పైసలు పెరుగుతుంది. నాన్‑సబర్బన్‑కు కిలోమీటర్‑కు మూడు పైసలు పెరుగుతుంది. దీంతో సామాన్యుడిపై మరో భారం పడనుంది.పెరిగిన ఛార్జీలు ఈ కింది విధంగా ఉన్నాయి.

రెండో తరగతి స్లీపర్ క్లాస్ కి. మీ. కు 2 పైసలు

స్లీపర్ క్లాస్ కి. మీ. కు 6 పైసలు

ఏసీ చైర్ కార్ కి. మీ. కు 10 పైసలు

ఏసీ త్రీటైర్‌కు పదిపైసలు

Railway Minister Pawan Bansal announces hike in railway fares

ఏసీ ఫస్ట్‌క్లాస్ స్లీపర్ కి. మీకు 30 పైసలు పెరిగింది. టికెట్‌పై రైల్వేఛార్జీలు 20 శాతం పెరగనున్నాయి. ఛార్జీల పెంపుతో రైల్వేకు రూ. 6,600 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇలా వచ్చిన ఆదాయం రైల్వే భద్రతకు, పరిశుభ్రతకు పెద్దపీట వేయనున్నట్లు రైల్వే మంత్రి పవన్‌ కుమార్ బన్సల్ తెలిపారు. ప్రతీ టికెట్‌పై డెవలప్‌మెంట్ ఛార్జ్ కింద ఐదు రూపాయలు వసూలు చేయనున్నారు. పెరిగిన ఛార్జీలుగా గమనిస్తే ఢిల్లీ - సికింద్రాబాద్ సెకండ్ ఏసీ ఛార్జ్ ఇప్పుడు ఉన్న ధరకు మరో రూ. 310గా పెంచారు.

ఢిల్లీ - సికింద్రాబాద్ ఏసీ త్రీటైర్ ధర రూ. 173 అదనంగా పెరిగింది.

ఢిల్లీ - సికింద్రాబాద్ స్లీపర్ క్లాస్ రూ. 105 అదనంగా చెల్లించాలి.

ఢిల్లీ - సికింద్రాబాద్ జనరల్ టికెట్టు ధర రూ. 6 అదనంగా చెల్లించాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla vijaya ramanaraogif
Ys vijayamma fires on congress government  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles