Pakistani army action highly provocative antony

defence minister ak antony, loc, indian soldiers, pakistan army, pakistan army, ak antony

Pakistan Army action highly provocative: Antony

AK Antony.gif

Posted: 01/09/2013 12:32 PM IST
Pakistani army action highly provocative antony

Pakistani Army action highly provocative: Antony

పాక్ సైనికుల చేసిన  పైశాచికత్వం పై భారత రక్షణ శాఖ మంత్రి  ఆంటోనీ తీవ్రంగా స్పందించారు. పాక్ సైనికులు  మరోమారు తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకుంది.  సరిహద్దులు దాటి రావడమే కాకుండా  ఇద్దరు  జవాన్లను  హతమార్చడంతో పాటు  అత్యంత కిరాతకంగా  వారి తలలను  వేరు చేసింది.  ఈ విషయం పై దేశ వ్యాప్తంగా  నిరసనలు వెల్లువెత్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భారత జవాన్లపై పాకిస్తాన్ జరిపిన కాల్పులపై భారత్ తీవ్రంగా స్పందించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, పాక్‌కు సరైన సమాధానం చెప్తామని రక్షణ మంత్రి ఆంటోనీ తెలిపారు. పాక్ హై కమిషనర్‌కు భారత విదేశాంగ శాఖ నోటీసులు పంపింది. ఇద్దరు జవాన్లపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. కాసేపట్లో ఆర్మీ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. లాన్స్‌లాయక్ హేమరాజ్, లాన్స్‌లాయక్ సుధాకర్ సింగ్ అనే ఇద్దరు జవాన్లు పాక్ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే.  భారత సరిహద్దుల్లో  పాక్  కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని.. దీనిపై  భారత్  తీవ్ర నిరసన వ్యక్తం  చేస్తోందని  ఆంటోనీ అన్నారు.  ఇది దారుణ చర్య అని..  పాకిస్థాన్  సమాధానం చెప్పాలని  విదేశాంగ  శాఖ మంత్రి సల్మాన్  ఖుర్షీద్  అన్నారు.  దీనిపై  వివరణ  ఇవ్వాల్సిందిగా  పాక్ హైకమిషనర్ ను  కోరినట్లు  చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Wife acid attack on husband in kurnool
Mla akbaruddin owaisi sent to 14 day judicial custody  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles