Botsa for delhi today cm to leave on sunday

PCC chief Botsa Satyanarayana, CM kriran kumar

Amid speculations that the Centre was seriously applying its mind on the Telangana issue, PCC chief Botsa Satyanarayana will be leaving for Delhi on Saturday night

Botsa for Delhi today_ CM to leave on Sunday.png

Posted: 01/06/2013 09:52 AM IST
Botsa for delhi today cm to leave on sunday

Botsa_CMముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కాంగ్రెస్ అధిష్టానం నుండి పిలుపు రావడవంతో ఆఘమేఘాల మీద ఢిల్లీకి పయనం అయ్యారు. బొత్స నిన్న రాత్రే ఢిల్లీకి వెళ్ళగా, నేడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళనున్నారు. ఢిల్లీలో తెలంగాణ పై వాడివేడి చర్చలు జరుగుతున్న సమయంలో  వీరిద్దరిని అధిష్టానం పిలవడం వెనుక ఓ ఏదో జరగబోతుందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం... తెలంగాణ అంశాన్ని పూర్తి స్థాయిలో చర్చించి, తుది నిర్ణయం చెప్పడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్దమౌవుతుందని అంటున్నారు. ఇక సోనియా గాంధీతో పాటు కోర్ కమిటీ సభ్యులు కూడా ఈ విషయంలో తీవ్ర మల్లగుల్లాడు పడుతున్నారని, తెలంగాణ అంశాన్ని రాహుల్ గాంధీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, తన సొంత పర్యవేక్షకులను పంపి అభిప్రాయ సేకరణ చేయించారని, దానికి అనుగుణంగా కూడా నిర్ణయం ఉండవచ్చని చెబుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ అంశం పై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం బొత్స, కిరణ్ లను మార్చి వీరే సీట్లో కూర్చోబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా వీరిద్దరిని యధావిధిగా కొనసాగిస్తూనే సమస్యకు ఏదో ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించవచ్చు. మొత్తానికి వీరిద్దరు ఢిల్లీ వెళ్ళడంతో ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akbaruddin owaisi to surrender
Nagam janardhan reddy fires on minister dk aruna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles