Nirbhaya funeral completed

Nirbhaya Funeral completed

Nirbhaya Funeral completed

Nirbhaya Funeral completed.png

Posted: 12/30/2012 12:31 PM IST
Nirbhaya funeral completed

Nirbhaya_Funeral_completed

ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కి గురై, పది రోజులకు పైగా బతుకు పోరాటం చేసిన ఆ బాధితురాలు నిన్న ఉదయం సింగపూర్ లో మరణించిన విషయం తెలిసిందే. ఈమె మృతదేహాన్ని సింగపూర్ నుంచి ఎయిరిండియా ప్రత్యేక విమానంలో ఇండియాకు తరలించారు. తెల్లవారుఝాము 3:30 గంటలకి ప్రత్యేక విమానంలో వచ్చిన ఈమె మృతదేహానికి అధికార లాంఛనాలతో భారీ భధ్రత మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలు ద్వారకా సెక్టర్ 24 శ్మశానవాటికలో ముగించారు.  ఈమె అంత్యక్రియలకు ఢిల్లీ ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్ పిఎన్ సింగ్, ప్రముఖ సామాజిక వేత్త, ఆప్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులు అరవింద్ క్రేజ్రీవాల్ హాజరయ్యారు. ఇక అంతకు ముందు ఈమె మృతదేహానికి ప్రధాని, ఏఐసీసీ అధ్యక్షురాలు విమానాశ్రయంలో నివాళలు అర్పించారు. గ్యాంగ్ రేప్ బాధితురాలిని చూసి చలించి పోయిన సోనియాగాంధీ తీవ్రంగా ఆవేదనకు గురి, ఆమె కన్నీటి పర్యంతం అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని, మహిళలకు కట్టుదిట్టమైన చట్టాలను తెస్తామని ఆమె అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Women raped by police constable
Hyderabad records 26 rise in rape cases in 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles