Danam nagender clarified on comments

minister danam nagendar, ys jagan, sharmila, ysr congress, YS Jagan sister Sharmila, congress party.

The minister from Hyderabad Danam Nagender has clarified on his comments. He yesterday said that YSR Congress party president YS Jagan's sister Sharmila is like his sister and he will meet Sharmila.

Danam Nagender clarified on comments.png

Posted: 12/23/2012 04:06 PM IST
Danam nagender clarified on comments

Danam_Nagenderరాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ నిన్న మాట్లాడిన మాటల పై ప్లేటు ఫిరాయించాడు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తాను వైయస్సార్ కూతురు షర్మిళను తర్వలో కలుస్తానని, ఆమె తనకు చెల్లెలు లాంటిదని, ఆమెను కలిస్తే తప్పేంటని అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యల పై మీడియాలో దానం కాంగ్రెస్ పార్టీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారనే వార్తలు వచ్చాయి. వీటి పై స్పందించిన దానం, తాను మాట్లాడిన మాటలను మీడియా వక్రీకరించిందని, తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ల బోనని, ఆ పార్టీలోకి వెళితే... ఇంటి ప్రక్కనున్న వారే కాకుండా, కట్టుకున్న భార్యలే ఓట్లు వేయరని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని స్పష్టం చేశారు.  వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఫ్లోర్ నేత కాలేరు తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నారని విమర్శించారు. కొత్తగా వచ్చిన పార్టీలు వారి స్వార్థం కోసం, అవినీతిని కాపాడుకునేందుకే వచ్చాయని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు మాత్రం దానం ఫ్లేటు ఫిరాయించడని, ఆయన వ్యాఖ్యలు మీడియా వక్రీకరించలేదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodela injured police lathi charge
Cm kiran hardle for telangana vivek  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles