Telugu bhashodyama samittee rally for mla bhumana karunakara reddy

world telugu conference, prapancha telugu mahasabhalu, telugu bhashodyama samittee rally, tirupati, mla bhumana karunakara reddy, తిరుపతి నగరంలో ముస్తాబుతున్న న ప్రపంచ తెలుగు మహాసభలు

telugu bhashodyama samittee rally for mla bhumana karunakara reddy

telugu bhashodyama.gif

Posted: 12/22/2012 12:36 PM IST
Telugu bhashodyama samittee rally for mla bhumana karunakara reddy

telugu bhashodyama samittee rally for  mla bhumana karunakara reddy

తిరుపతి నగరంలో ముస్తాబుతున్న న ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ 27, 28, 29 తేదీలలో తిరుపతిలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములు కావాలని ప్రభుత్వం కోరుతుంది.  అయితే  ప్రపంచ తెలుగు మహాసభలను వ్యతిరేకిస్తూ తెలుగు భాషోద్యమ సమితి భారీ ర్యాలీ నిర్వహించింది. తెలుగు మహాసభలను కాంగ్రెస్ నేతలు జాతరలా నిర్వహిస్తున్నారని సమితి సభ్యులు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ నిరసనలకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నెల 27,28,29 తేదీలలో ప్రపంచ తెలుగు మహాసభలను తిరుపతిలో నిర్వహిస్తున్నారు.  తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ఉద్యమ సంఘాలు, తెలంగాణ జర్నలిస్టు ఫోరం కార్యాచరణ ప్రకటించాయి. తెలుగు మహాసభలను బహిష్కరించాయి. వాటికి వ్యతిరేకంగా అదే రోజు హైదరాబాద్ లో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు మహాసభలలో తెలంగాణ సంస్కృతిని విస్మరిస్తున్నారని వారు అంటున్నారు. తెలుగు మహాసభలను బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో మహాసభలకు వ్యతిరేకంగా తిరుపతిలోనే నిరసనలు రావడం చర్చకు తెరలేపుతోంది. మహాసభల తేదీలు దగ్గరకు వస్తున్నా ఇంతవరకు కనీసం ఆహ్వానపత్రాలు కూడా అందలేదని, స్వయంగా ప్రముఖులు వచ్చి కోరుతున్నా అందడంలేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం ఎలా ముగుస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Railway passengers angry protest against railways on vijaywada
One crore signatures for ys jagan release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles