Bangai anantaiha in congress party meeting

bangi ananthaiah, chandrababu naidu, ys jagan, congress,

Kurnool former Mayor Bangi Ananthaiah was appeared in Congress meeting on Sunday.

bangai anantaiha in congress party meeting.png

Posted: 12/16/2012 04:39 PM IST
Bangai anantaiha in congress party meeting

Bangiకర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య ఎక్కడున్నా అక్కడ ఓ సెన్సేషన్. తెలుగు దేశం పార్టీకి వీర విధేయుఢిగా ఉన్నప్పుడు వివిధ వేశాధారణల్లో నిరసనలు తెలిపే బంగి తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరణకు గురై ఆరు నెలల క్రితం కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ మేధోమధన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సదస్సులో ఆయన హల్ చల్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబునాయుడి పై మాటల దాడి చేశారు. చంద్రబాబు నా ఉసురు తగిలి రెండుసార్లు ఇప్పటికే అధికారానికి దూరంగా ఉన్నాడని, మూడోసారి కూడా ఓడిపోతున్నాడని జోస్యం చెప్పారు. 2014 ఎన్నికల్లో టిడిపి ఓడుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఈ రోజు తనను సస్పెండ్ చేసిన రోజన్నారు. తన సతీమణి మార్కెట్ యార్డులో కూలీ పని చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ జాతీయ పార్టీ అని.. ఈ పార్టీ పర్మినెంట్‌గా ఉంటుందన్నారు. కాంగ్రెసు సముద్రం వంటిదని దీనిని నమ్ముకున్న వాళ్ల ఎవరు నష్టపోరని, ప్రాంతీయ పార్టీలను నమ్ముకుంటే ఉపయోగం ఏం ఉండదని, ఇక పై కాంగ్రెస్ లో చురుకైన పాత్రను పోషిస్తానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Konda surekha fire on kcr
Congress meeting at lb stadium  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles