Congress meeting at lb stadium

chiranjeevi, telangana, jana reddy, botsa satyanarayana

Congress party leaders paid condolence to students who were committed suicide for Telangana and Samaikyandhra.

Congress Meeting at LB Stadium.png

Posted: 12/16/2012 12:56 PM IST
Congress meeting at lb stadium

meeting

అధికార కాంగ్రెస్ పార్టీ మేధోమథన సదస్సు ఇవాళ హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభం అయింది. ఈ మేథోమధన సదస్సుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, రాష్ట్ర, కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. సదస్సు ఆరంభంలోనే రసాబాసా చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ ఫోటోలు లేకపోవడం ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనే కాకుండా కేంద్రమంత్రి చిరంజీవి ఫోటోలు లేకపోవడంతో ఆయన వర్గీయులు, అభిమానులు ఆందోళనకు దిగారు. ఇటు దామోదర, అటు చిరు వర్గీయులు ఆందోళనకు దిగడంతో అక్కడ రసాభాసా ఏర్పడింది. ఇక ఈ సదస్సుకు వచ్చిన తెలంగాణ ఎంపీలకు అవమానం జరిగింది. సదస్సుకు వస్తున్న ఎంపీలకు పాసులు లేవని అడ్డుకోవడంతో వారు వేదిక ముందు బైఠాయించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

దీంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ఎంపీలను బుజ్జగించి వేదిక పైకి తీసుకు వెళ్లారు. ఎంపీ పొన్నం తెలంగాణ అమర వీరులకు సంతాపం ప్రకటించాలని చూచించగా బొత్స సమైక్య, తెలంగాణ ఉద్యమాల్లో ఎంతో మంది చనిపోయారని, వారందరికీ సదస్సు తరఫున అధ్యక్షుడిగా తాను సంతాపం తెలియజేస్తున్నానని, అందరి ఆత్మలకు శాంతి కలగాలని మౌనం పాటిద్దామన్నారు. ఇక కేంద్రమంత్రులు పురంధేశ్వరి, జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నగరంలో ఉన్నప్పటికీ హాజరు కాలేదు. మొత్తానికి కాంగ్రెస్ మేథోమధన సదస్సు రసాభాసాగా తయారయ్యిందని అంటున్నారు అక్కడి వారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles