Congress leaders on sc st sub plan

chiranjeevi, congress leaders, cm kiran kumar reddy, dy cm damodar raja narsimha, chiranjeevi, botsa saytanarayana, congress state leaders, on sc st sub plan

congress leaders on sc st sub plan

9.gif

Posted: 12/02/2012 03:24 PM IST
Congress leaders on sc st sub plan

chiru_botsa

        ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్దత కోసం కృషి చేసిన ఘనత తమదంటే తమదేనంటూ పోటీలు మొదలయ్యాయి. ఈ పోటీ అధికార, ప్రతిపక్షాలకు మధ్య ఉండటం సహజం. కానీ అదే అధికార పక్షంలోనే ఉంటే అదే విచిత్రం మరీ. మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు ఎవరికి వారే ఈ విషయంలో తామే ఛాంపియన్లమంటూ చెప్పుకుంటున్నారు.  ఆ జాబితాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ్మా, మంత్రి డీఎల్ చివరకు కేంద్ర మంత్రి చిరంజీవి కూడా ఉన్నారు.
        ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ సబ్ ప్లాన్ కు చట్టబద్దత కల్పించాలనే ఆలోచనల ఎలా వచ్చిందో వివరించారు. ఇందిరమ్మ బాట, రచ్చబండ సమయంలో గ్రామాల్లో విస్తృతంగా పర్యటించానని నిధులు సరిగా అందకపోవడం వల్లనే ఎస్సీ, ఎస్టీలు అభివృద్ది చెందలేదన్న విషయం గుర్తించానని చెప్పారు. అందుకే సబ్ ప్లాన్ కు చట్టబద్దత ఉండాలనే ఆలోచన వచ్చిందని చెప్పుకొచ్చారు.

cm_dy
        కేంద్ర మంత్రి చిరంజీవి. లేదు లేదు తన వల్లే సబ్ ప్లాన్ కు చట్టబద్దత వచ్చిందని చెప్పుకునే జాబితా చేరిపోయారు. అసెంబ్లీకి వచ్చిన చిరంజీవి తన పాత పీఆర్పీ ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయం ఎజెండాగా వచ్చిన పీఆర్పీ,.. తరువాత కాంగ్రెస్ వల్లే సామాజిక న్యాయం సాధ్యమైని నమ్మి పార్టీని విలీనం చేశామన్నారు. విలీనం సమయంలోనే తను పెట్టిన షరతుల్లో సబ్ ప్లాన్ కూడా ఒక అంశమన్నారు.
      సబ్ ప్లాన్ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉన్న డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ్మ కూడా ‍ఛాంపియన్  పోటీలో ఉన్నారు. సబ్ ప్లాన్ కు చట్టబద్దత కల్పించాలని తాను చాలా సార్లు అధిష్టానాన్ని కోరానని చెబుతున్నారు. మొత్తానికి ఎవరికీ వారే సబ్ ప్లాన్ కు తామే చాంపియన్లమంటూ మాట్లాడుతోన్న విషయాన్ని గ్రహించిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పందించిక తప్పలేదు. ఇది ఏ ఒక్క వ్యక్తి వల్లే సాధ్యం కాలేదని ఒక్కముక్కలో తేల్చిపారేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T jac leaders future course of action
Building construction in record two days time  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles