Narendra modi attacks manmohan singh

Narendra Modi attacks Manmohan Singh,Modi attacks Congress, calls PM maun Mohan Singh, Congress, Narendra Modi, BJP, Manmohan Singh, Himachal Pradesh Assembly polls

Narendra Modi attacks Manmohan Singh

Modi.gif

Posted: 10/30/2012 11:19 AM IST
Narendra modi attacks manmohan singh

Narendra Modi attacks Manmohan Singh

ప్రధాని మన్మోహన్ సింగ్‌పై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మరోసారి వాగ్బాణాలను సంధించారు. దేశంలోని పేదల దుస్థితి, ధరల పెరుగుదలపై ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న మన్మోహన్ సింగ్‌ను ‘మౌన మోహన్ సింగ్’గా మోడీ అభివర్ణించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించిన మౌన‌ మోహన్ సింగ్ ఎట్టకేలకు మౌనం వీడారంటూ నేడు పత్రికల్లో పెద్ద పెద్ద వార్తలు వచ్చాయి. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆలోచన ఏమిటో అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కావడం లేదు’ అని మోడీ పేర్కొన్నారు. మండీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. పేదరికం, ధరల పెరుగుదల వంటి ప్రధాన సమస్యలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మోడీ ధ్వజమెత్తారు. ‘సోనియా గాంధీ కొద్ది రోజుల క్రితం మండీలో పర్యటించారు. అలాగే ఇప్పుడు మన్మోహన్ సింగ్ కూడా ఇక్కడికి వచ్చారు. దేశంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల వారు కనీసం ఆందోళన కూడా వ్యక్తం చేయలేదు. ధరల పెరుగుదల, పేదరికం గురించి వారు ఒక్కసారైనా నోరు విప్పాల్సింది. అలా చేసి ఉంటే నేను ఎంతో సంతోషించి సంతృప్తి చెందేవాడిని. దేశాన్ని పట్టిపీడిస్తున్న ద్రవ్యోల్బణ సమస్య గురించి వీరెప్పుడైనా పెదవి విప్పారా? దీని గురించి మాట్లాడాల్సిన బాధ్యత ప్రధాన మంత్రికి లేదా? పెరిగిన ధరలు ఎప్పటికైనా దిగివస్తాయని వారు ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది’ అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brahmins attacked mohan babu
Anna hazare to announce new team  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles