Anna hazare to announce new team

Anna Hazare to announce new team? VK Singh, Arvind Kejriwal,anna hazare, fdi, manmohan singh, lokpal bill, anna new team , Anna Hazares new anti graft team,

Anna Hazare to announce new team?

Anna.gif

Posted: 10/30/2012 11:13 AM IST
Anna hazare to announce new team

Anna Hazare to announce new team?

దేశంలో అవినీతికి వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ కూటమి పేరును దీపావళి పండుగకు ముందే వెల్లడిస్తామని సామాజిక కార్యకర్త అన్నా హజారే ప్రకటించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరైన సైనికదళ మాజీ ప్రధానాధికారి జనరల్ వి.కె.సింగ్‌తో కలసి ఆయన ముంబయిలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కూటమి తుది స్వరూపం ఇంకా ఖరారు కావలసి ఉందని, అయితే ఇందుకు సంబంధించి ప్రతి రాష్ట్రంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని హజారే తెలిపారు. అవినీతి ఊబిలో పీకల్లోతున కూరుకుపోయిన యుపిఎ సర్కారు బడా వ్యాపారవేత్తలతో చేతులు కలిపి ప్రజల బాగోగులను పట్టించుకోవడం మానేసిందని వి.కె.సింగ్ ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి సమస్యపై ప్రజల్లో చైతన్యం తీసుకురావలసిన ఆవశ్యకత ఎంతో ఉందని, ఇందుకోసం వి.కె.సింగ్, తాను కలసి జనవరి 30 నుంచి దేశవ్యాప్తంగా పర్యటిస్తామని హజారే (75) తెలిపారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో తాము ప్రచారం నిర్వహించబోమని ఆయన చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పోటీచేసే అభ్యర్థుల నీతి, నిజాయితీలను తమ బృందం బేరీజువేసి ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు సూచిస్తుందని హజారే తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narendra modi attacks manmohan singh
Tdp leaders comment on jaipal reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles