ఇంతకాలం కలగానే మిగిలిపోయిన సన్నివేశం సాకారమవుతున్నట్లు కనిపిస్తోంది. అవిభక్త కవలలు వీణ-వాణి(9) ఎట్టకేలకు వైద్యం కోసం త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు. వీరికి శస్త్రచికిత్స చేసి.. విడదీసేందుకు అమెరికాకు చెందిన బాల్టిమోర్ చిన్నపిల్లల ఆస్పత్రి వైద్యులు ముందుకొచ్చారు. కొద్ది రోజుల క్రితమే నీలోఫర్ వైద్యులతో సంప్రదింపులు జరిపారు. ఆరుగురు వైద్యుల బృందానికి సారధ్యం వహిస్తున్న డా.డేవిడ్ స్టీఫెన్ బర్గ్ అవిభక్త కవలలు వీణ-వాణిలను పరిశీలించి వెళ్లారు. 2006 ఏప్రిల్ 19 నుంచి వీణ-వాణి నీలోఫర్‌లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా, వీణ-వాణిలను పరిశీలించిన అనంతరం బాల్టిమోర్ వైద్యుల బృందం కొన్ని అభిప్రాయాలను వ్యక్తీకరించింది.ఈ చిన్నారులకు భారత్‌లో శస్త్రచికిత్స నిర్వహించలేమని, అమెరికాలో మాత్రమే చేయగలమని చెప్పారు.మూడేళ్ల పాటు న్యూయార్క్ సమీపంలో ఉన్న బాల్టిమోర్ ఆస్పత్రిలోనే ఉండాలని, నాలుగు దశల్లో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఇద్దరూ సురక్షితంగా ఉంటారా లేక ఒకరే ప్రాణాలతో ఉంటారా అన్న విషయాలను ఇప్పుడే తాము చెప్పలేమని డా. డేవిడ్ స్టీఫెన్‌బర్గ్ స్పష్టం చేశారు.
శస్త్రచికిత్సకు రూ.6 కోట్ల వరకూ ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. దశలవారీగా జరిగే ఈ శస్త్రచికిత్సలో 17 నుంచి 33 మంది వైద్య నిపుణులు పాల్గొంటారని, రెండు మాసాల్లో వీణ-వాణిలకు సంబంధించిన శస్త్రచికిత్స, వైద్య ఖర్చులు తదితర అన్ని వివరాలను నీలోఫర్ వైద్యబృందానికి అందజేస్తామని డా.స్టీఫెన్ బర్గ్ నీలోఫర్ సూపరింటెండెంట్ డా.డి.రంగనాథ్‌కు తెలిపారు.వీణ-వాణిలతోపాటూ పాట్నాకు చెందిన అవిభక్త కవలలు సబా సలీమ్-ఫరా సలీమ్‌లకూ శస్త్రచికిత్స చేయడానికి బాల్టిమోర్ డాక్టర్లు ముందుకొచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం సబా-ఫరాల వయసు 16 ఏళ్లు. వీరికి ప్రభుత్వమే వైద్యమందించాలని ఆరుషి ధస్మానా అనే ఓ న్యాయశాస్త్ర విద్యార్థి సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దీంతో వారిద్దరికీ ప్రభుత్వమే వైద్యం అందించాలని, అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు డా. బెంజిమెన్ కార్సన్‌తో పాటు ఎయిమ్స్‌కు చెందిన ఓ న్యూరో సర్జన్ ఆధ్వర్యంలో ఆ శస్త్రచికిత్స చేయించాలని సుప్రీం కోర్టు ఈ ఏడాది జూలై 16న తీర్పునిచ్చింది. దీంతో వీణ-వాణిలతో పాటు సబా-ఫరాలకూ బాల్టిమోర్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more