Oldest dad is father again at 96

Worlds oldest father at the age of 96, Ramjit raghav, wife Shakunthala age 54, Haryana, Sonepat, Two childs, farmer, healthy children,

Oldest dad is father again at 96

Oldest.gif

Posted: 10/17/2012 01:14 PM IST
Oldest dad is father again at 96

96-year-old Indian becomes 'world's oldest father'

మలి వయసులో రసికుడి పేరు సంపాదించిన తాత, ముత్తాత కాదు.. తండ్రి ,96 ఏళ్ల వయసులో రైతు కూలీ రికార్డు, 52 ఏళ్ల భార్యకు రెండో కొడుకు. ఆయన వయసు 96 ఏళ్లు.. ఆమె వయ సు 52 ఏళ్లు. మనవళ్లు, ముని మనవళ్లతో ఆడుకోవాల్సిన ఈ లేటు వయసులో ఆ దంపతులిద్దరూ తల్లిదండ్రులయ్యారు! బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద వయసులో తండ్రి అయిన ఘనత హర్యానాలోని సోనిపట్ సమీపంలో గల ఖర్ఖోడా గ్రామవాసి రామజిత్ రాఘవ్‌కే దక్కుతుందేమో! రెండేళ్ల క్రితం తొలిసారి మగబిడ్డను కన్న ఆయన భార్య శకుంతలాదేవి.. ఇప్పుడు రెండోసారి కూడా మరో పుత్రరత్నానికి జన్మనిచ్చింది. ఊరికి వెలుపల ఒకే ఒక్క గదిలో ఉండే ఆ జంట కు పుట్టిన రెండో కొడుకు కూడా మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వర్గాలు తెలిపాయి. తన తొలి కుమారుడికి విక్రమ్‌జీత్ అని పేరుపెట్టిన రాఘవ్.. రెండో కుమారుడికి రంజిత్ అని పేరుపెట్టాడు.

96-year-old Indian becomes 'world's oldest father'

తన భార్యకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించాలని నిర్ణయించాడు. తాను చాలాకాలం పాటు బ్రహ్మచారిగానే ఉండిపోయానని, పదేళ్ల క్రితం శకుంతలను చూసేవరకు పెళ్లి ఆలోచనే రాలేదని చెప్పాడు. కొన్నాళ్లు కలిసున్న తర్వాత తమకు ఇద్దరు పిల్లలను కనాలనిపించిందని, దేవుడి దయతో ఆ కోరిక నెరవేరిందని తెల్లగెడ్డాన్ని చిద్విలాసంగా నిమురుకుంటూ రాఘవ్ ఆనందంగా చెప్పాడు.ఇంతకుముందు రాజస్థాన్‌కు చెందిన నానురామ్ జోగి (90) 21వ బిడ్డను కని లేటు వయసులో తండ్రి అయిన ఘనత సాధించాడు. ఆ రికార్డును ఇప్పుడు రాఘవ్ బద్దలు కొట్టాడు. రోజూ తెల్లవారుజామునే ఐదు గంటలకు లేచి పొలం పనికి వెళ్తానని, రోజుకు రెండు లీటర్ల ఆవుపాలు, తాజా ఆకుకూరలు, చపాతీలు తీసుకుంటానని రాఘవ్ చెప్పాడు. కాగా, తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వద్ధాప్య పింఛన్‌గా రూ. 500 వస్తుందని శకుంతల చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kannada tv actor hemashri died
Attacks for women in ap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles