Trs president wants kodandaram removed

kcr, Telangana statehood demand, Telangana march, TRS-TJAC rift, K. Chandrasekhar Rao, M. Kodandaram, Telangana Joint Action Committee

TRS and Telangana Joint Action Committee (TJAC) have widened so much that TRS president K. Chandrasekhar Rao wants the removal of TJAC chairman M. Kodandaram.

TRS president wants Kodandaram removed.png

Posted: 10/09/2012 10:21 PM IST
Trs president wants kodandaram removed

kcr_kodandaramచిలికి చిలికి గాలి వానలా తయారయ్యాయి కేసీఆర్ - కోదండరామ్ మధ్య విభేధాలు. ఢిల్లీ నుండి వచ్చిన కేసీఆర్ తెలంగాణ జేఏసీ నాయకులతో  హైదరాబాద్ శివార్లలో తన ఫాం హౌజ్ లో చర్చలు జరుపుతున్నారు. అయితే ఇంత వరకు ఈ చర్చలకు కేసీఆర్ కోదండరామ్ ని పిలవలేదు. వివిధ సంఘాల నాయకులతో జరపిన చర్చలలో కేసీఆర్ కోదండరామ్ పై తన వ్యతిరేకతను ప్రదర్శించినట్లు తెలుస్తుంది. తనను కలిసిన న్యూడెమొక్రసి నాయకులతో కెసిఆర్ మాట్లాడుతూ కోదండరామ్ ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ మార్చ్ ను ఏకపక్షంగా నిర్వహించారని, తెలంగాణ ప్రజాప్రతినిదులను ఎవరు బడితే వారు ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకున్నారని కెసిఆర్ బాధపడ్డారు. విమలక్క కూడా కెసిఆర్ ను ఉద్దేశించి ఢిల్లీలో కాళ్లు పట్టుకోవడం కాదు.. గల్లిలో రాళ్లు పట్టుకోవాలని అన్న విషయం కూడా తెలిసిందే.

కోదండరామ్ తీరు పై గుర్రుగా ఉన్న కేసీఆర్ ఆయన్ను పదవి నుండి తప్పించాలనే ఆలోచనకు వచ్చి సంకేతాలు కూడా ఇచ్చినట్లు వార్తలు. దీనిని బట్టి చూస్తుంటే కేసీఆర్ తెలంగాణకు పెట్టిన అక్టోబర్ డెడ్ లైన్ లోపల తెలంగాణ రావడం ఏమో గానీ, జేఏసీ ఛైర్మెన్ మాత్రం మారుతాడని స్పష్టంగా తెలుస్తుంది. నిన్నగాక మొన్ననే మీడియాతో మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించాడు కోదండరామ్. ఈ వార్తల్లో నిజమెంతో అబద్దమెంతో తెలియాలంటే దీని పై కేసీఆర్ నోరు విప్పాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys vivekananda reddy injured in his car accident
Mla shankar rao challenges modi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles