Bond car auctioned for rs2 crores

James Bond, James Bond car, James Bond movie, 2 Crore

A 2008 Aston Martin car used by Daniel Craig in the James Bond movie “Quantum of Solace” has been sold in an auction of Bond movie.

James Bond car sells for 2 crore.png

Posted: 10/08/2012 09:17 PM IST
Bond car auctioned for rs2 crores

Car-costజేమ్స్‌బాండ్ సినిమాలంటే ఎంత క్రేజ్ ఉంటుందో మనకు తెలిసిందే. బాండ్ సినిమాలకే కాదు.. వాటిలో వాడిన వస్తువుల పట్ల కూడా అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంది. బాండ్ సినిమాల్లో ఉపయోగించిన కార్లు, వాచీలు తదితర వస్తువులకు వేలంలో కళ్లు చెదిరే మొత్తాలు లభించడమే ఇందుకు నిదర్శనం. జేమ్స్‌బాండ్ తొలి సినిమా ‘డాక్టర్ నో’ వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాండ్ సినిమాల్లోని పలు వస్తువులను లండన్‌లోని క్రిస్టిస్ సంస్థలో వేలం వేశారు. ‘క్వాంటమ్ ఆఫ్ సొలేస్’ చిత్రంలో బాండ్ పాత్రధారి డేనియల్ క్రెయిగ్ ఉపయోగించిన 2008 మోడల్ ఆస్టన్ మార్టిన్ కారుకు ఏకంగా 2.41 లక్షల పౌండ్ల(రూ.2 కోట్లపైనే) ధర పలికింది. ఇది ఆ కారు వాస్తవ ధర కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. మొత్తం బాండ్ సినిమాల్లోని 11 వస్తువులను వేలం వేయగా 7.52 లక్షల పౌండ్లు(దాదాపు రూ.6.30 కోట్లు) లభించాయి. ఈ మొత్తాన్ని వివిధ ఛారిటీ సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Barcode 60 years of scanning history
65k bihar policemen threaten mass leave  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles