Mother sells baby boy to buy mobile phone

Mother,Odisha, sells baby boy, buy mobile phone, jeans,tops,Orissa High Court, Mother Selling Baby,Jajpur Baby Selling,

Mother in Odisha sells baby boy to buy mobile phone, jeans and tops

Mother.gif

Posted: 10/04/2012 12:07 PM IST
Mother sells baby boy to buy mobile phone

Mother in Odisha sells baby boy to buy mobile phone, jeans and tops

పిల్లలు దేవుడి స్వరూపాలు. ఆ పిల్లల కోసం ఎంతమంది స్త్రీ లు పూజలు, నోములు చేస్తారు.  అమ్మతనం కోసం స్త్రీలు పరితపిస్తారు. కన్న బిడ్డ కంటే ఈ లోకంలో అమ్మకు ఏదీ ఎక్కువ కాదు. కానీ హైటెక్ యుగంలో  కన్న బిడ్డ కంటే సెల్ పోన్ ముఖ్యం అనే పుణ్య స్త్రీలు ఉన్నారు. కేవలం సెల్‌ఫోన్, మెమరీ కార్డులు, జీన్స్ వంటి వస్తువులు కొనుక్కునేందుకే ఒడిశాలో ఓ తల్లి 17 నెలల మగబిడ్డను అమ్మేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జైలులో ఉన్న భర్తను విడిపించుకునేందుకు డబ్బు అవసరమై బిడ్డను విక్రయించినట్లు తొలుత బుకాయించిన ఆమె తర్వాత చెప్పిన విషయాలు విని పోలీసులు నిర్ఘాంతపోయారు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా ముందమల గ్రామానికి చెందిన రాఖీ పాత్రా(20) అనే మహిళ ఓ రిక్షా కార్మికుడితో కలిసి రూ. 5 వేలకే తన మగబిడ్డను విక్రయించింది. సెప్టెంబరు 17న కటక్‌కు చెందిన వ్యక్తి బిడ్డను కొనుగోలు చేసినట్లు మీడియా కథనాల ద్వారా వెలుగుచూడటంతో ఒరిస్సా హైకోర్టు సూ మోటోగా విచారణ ప్రారంభించి దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో పోలీసులు బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె పిల్లాడిని తీసుకోవడానికి నిరాకరించడంతో శిశు సంక్షేమ కమిటీకి అప్పగించారు. కొనుగోలుచేసిన వస్తువులను బట్టి చూస్తే పేదరికం వల్ల కాకుండా వాటి పట్ల వ్యామోహంతోనే ఆమె బిడ్డను అమ్మినట్లు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Biodiversity meeting in hyderabad
First person in the world to live with no heart or pulse  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles