నగరంలో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సు ప్రాంగణంలోని ఫుడ్ కోర్టులో ఆహార పదార్థాల ధరలు మండిపోతున్నాయి. సదస్సుకు సహకరించడానికి వచ్చిన వాలంటీర్లు కప్పు టీ తాగాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. నగరం, శివార్లలోని పలు కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు వాలంటీర్లుగా పని చేస్తున్నారు.వీరికి పాకెట్ మనీ కింద కొంత మొత్తంలో ఎన్జీసీ అందిస్తోంది. అయితే వీరు అందించే డబ్బులకు సదస్సు ప్రాంగణంలో ఉన్న ఫుడ్ కోర్టులో వాటర్ బాటిల్ కూడా రావడం లేదు. ఇక్కడ ఆహార పదార్థాల ధరలను అమాంతం ఫైవ్‌స్టార్ రేట్లకు సమాంతరంగా పెంచేశారు. కప్పు టీ ధర రూ. 60 , సమోసా ధర రూ. 50 , భోజనం తినాలంటే ఏకంగా రూ. 360 చెల్లించాల్సిందే. ఇంత మొత్తంలో డబ్బులు చెల్లించే పరిస్థితి లేక వాలంటీర్లు అల్లాడుతున్నారు. పోనీ ఇంటి నుంచో లేక బయట బహిరంగ మార్కెట్ నుంచో ఆహారాన్ని తీసుకుని వద్దామంటే దాన్ని సెక్యూరిటీ అడ్డుకుంటోంది.
బిస్కెట్ ప్యాకెట్‌ను సైతం అనుమతించడం లేదని ఓ వాలంటీర్ వాపోయాడు. ఫుడ్ కోర్టు ధరలను భరించలేక సగానికి పైగా వాలంటీర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను వాలంటీర్ల ప్రతినిధులు జీవ వైవిధ్య మండలి చైర్మన్ హంపయ్య దృష్టికి తీసుకుని వెళ్లారు. పరిస్థితిలో మార్పు రాకపోతే వాలంటీర్లు సదస్సుకు రావడం మానేస్తామని చెబుతున్నారు. ఇదే పరిస్థితి సదస్సును కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులకు ఉంది. రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు బోజనం ఏర్పాటు చేశారు. అయితే ఆ బోజనాన్ని సైతం సదస్సులోకి అనుమతించలేదు. దీంతో శిల్పారామంలో సమాచార శాఖాధికారులు మీడియా ప్రతినిధులకు బోజనం ఏర్పాటు చేశారు. అదే సమయంలో సదస్సులో కీలకమైన సమాంతర సమావేశాలు ప్రారంభం కావడంతో చాలా మంది మీడియా ప్రతినిధులు శిల్పారామానికి వెళ్లలేకపోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more