Telangana march for september 30 causes political debate

Telangana march for September 30 causes political debate

march.gif

Posted: 09/25/2012 07:47 PM IST
Telangana march for september 30 causes political debate

Telangana march for September 30 causes political debate

తెలంగాణ మార్చ్ వేదిక ఎట్టకేలకు ఖరారైంది. ఈ నెల 30న ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డుపైనే తెలంగాణ కవాత్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 29లోగా తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన ఇప్పిస్తే తెలంగాణ కవాత్ ను వాయిదా వేసుకునే విషయాన్ని పునరాలోచన చేస్తామనీ కూడా తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ హోదాలో కోదండరాం స్పష్టం చేశారు.ఈ నెల 30న గణేష్ నిమజ్జనం, వచ్చే నెల 1న హైదరాబాద్ లో అంతర్జాతీయ జీవవైవిధ్యసదస్సును ద్రుష్టిలో పెట్టకుని తెలంగాణ కవాత్ ను వాయిదా వేసుకోవాలనీ సీఎం కిరణ్, తెలంగాణ మంత్రులు ఇప్పటికే టీజేఏసీని కోరిన విషయం విధితమే.

అయితే, దీనికి స్పందించిన టీజేఏసీ ఈ నెల 29లోగా తెలంగాణపై ప్రకటన ఇప్పిస్తే తప్పకుండా మానుకుంటామంటున్నారు. మేము సీఎం కిరణ్, టీ మంత్రులు విన్నపాన్ని వింటున్నప్పుడు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణపై కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి కదా? అంటున్నారు.కవాత్ ను వాయిదా వేసుకోవాలంటున్న తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు కేంద్రంతో స్పష్టమైన ప్రకటనైనా ఇప్పించండి లేదా, కవాత్ లో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాల్గొనాల్సిందిగా కోదండరాం కోరుతున్నారు. కోదండరాం స్పందనపై ఇప్పటి వరకు ఏ టీ మంత్రి స్పందించలేదు.

అయితే, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మార్చ్ ను ఆపే ప్రసక్తే లేదనీ టీజేఏసీ అంటోంది. ర్యాలీకి ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. పోలీసులు తమకు అనుమతి ఇస్తే శాంతియుతంగా కవాత్ను నిర్వహించుకుంటామనీ, కాదు, అని బెట్టు చేస్తే ర్యాలీ ఎటుదారితీస్తుందో తాము చెప్పలేమనీ టీజేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ మార్చ్ కు కేవలం 5రోజుల గడువు మాత్రమే మిగిలింది. దీనిని ఎలాగైనా ఆపాలనే గట్టి ప్రయత్నంలోనే ఉన్న కాంగ్రెస్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ భేటీ కానున్నది. ఈ భేటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం వుందనీ ప్రచారం జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pm may address nation monday on coal scam
No discussion on telangana at congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles