No discussion on telangana at congress

Telangana ,Congress Working Committee meet ,CWC ,Sonia Gandhi ,Janardhan Dwivedi ,Congress

No discussion on Telangana at Congress Working Committee meet

Telangana.gif

Posted: 09/25/2012 06:30 PM IST
No discussion on telangana at congress

No discussion on Telangana at Congress Working Committee meet

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీపై పెట్టుకున్న ఆశలన్నీ తుస్సుమన్నాయి. తెలంగాణపై ఆఖరి ప్రతయ్నంగా ఢిల్లీలో మకాం వేశారు కేసీఆర్. తెలంగాణ కోసం టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. తెలంగాణపై కాంగ్రెస్ లో కదలికలు ప్రారంభమయ్యాయనీ, ఈ రోజున జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనీ కేసీఆర్ గట్టిగా విశ్వసించారు.కానీ, కోర్ కమిటీపై కేసీఆర్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. కోర్ కమిటీ జరిగినప్పటికీ…తెలంగాణపై ఎలాంటి చర్చ లేకుండానే ముగిసింది. ఆర్థిక సంస్కరణలకు కాంగ్రెస్ కోర్ కమిటీ అమోదం తెలిపింది. ప్రధానమంత్రికి సోనియా పూర్తిగా మద్దతుగా నిలిచారు. కానీ, తెలంగాణ అంశంపై ఎలాంటి చర్చ జరగకుండానే కోర్ కమిటీ సమావేశం ముగిసింది.

సమావేశం అనంతరం పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు జనార్ధన్ ద్వివేది మాట్లాడుతూ ఈ సమావేశంలో తెలంగాణపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడే తెలంగాణపై కనీసం చర్చ కూడా జరగలేదనీ చెప్పడంతో తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం అంతగా సీరియస్ గా పట్టించుకోవడం లేదనీ తేలిపోయింది.నిన్నటి వరకు తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రం కసరత్తులు చేస్తుందనీ, తెలంగాణపై అనుకూలంగా ప్రకటన చేయడం తథ్యమనీ గులాబీ దండు చెప్పుకుంటూ వస్తోంది. కానీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దీనిపై కనీసం చర్చించకపోవడం చూస్తే ఇప్పట్లో తెలంగాణను కాంగ్రెస్ తేల్చదనీ, ఇప్పటి వరకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరేననీ చెప్పొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana march for september 30 causes political debate
Fifty panches resign in north kashmir  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles