Ministers son claims he is owed rs 2cr

Minister's son claims he is owed Rs 2cr,crime, Vikram Goud,Brother Anil Kumar, Minister Mukesh Goud, his son Vikram Goud involved in a land-settlement

Minister's son claims he is owed Rs 2cr

Minister.gif

Posted: 09/17/2012 07:05 PM IST
Ministers son claims he is owed rs 2cr

Minister's son claims he is owed Rs 2cr

యూరియా కుంభకోణంలో నిందితుడైన సాంబశివరావు తనకు నీతివాక్యాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 2009లో బ్రదర్ అనిల్‌కుమార్‌కు చెందిన స్టీల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేసిన కొండలరావు సిఫారసుతో సాంబశివరావుకు రూ. 2 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు విక్రమ్ పేర్కొన్నారు. తన వద్ద అప్పుగా తీసుకున్న రూ. 2 కోట్లు తిరిగి చెల్లించాలని అడగానే తప్ప.. రియల్టర్ సాంబశివరావుపై ఎప్పుడూ ఎలాంటి దౌర్జన్యం చేయలేదని మంత్రి ముఖేష్ కుమారుడు ఎం.విక్రమ్‌గౌడ్ అన్నారు. అప్పు తీర్చాలని అడిగితే.. దౌర్జన్యం చేశానని తప్పుడు ఫిర్యాదులు చేస్తూ రాద్ధాంతం సృష్టించారని చెప్పారు. ఇంజనీరింగ్, ఎంబీఏ చేసిన తనకు.. దందాలు, సెటిల్మెంట్లు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అప్పు తీర్చాలని అడిగితే రూ. 25 లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమచేశారని.. మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని అడిగితే గోపన్నపల్లిలోని ఐదెకరాల స్థలం తీసుకుని.. దాన్ని విక్రయించగా వచ్చే మొత్తంలో బాకీ పోను మిగిలిన మొత్తాన్ని తనకు ఇవ్వాల్సిందిగా సాంబశివరావు కోరారన్నారు. ఈ స్థలం సొసైటీ పేర రిజిస్టర్ అయ్యిందని, దీన్ని ఆయన బ్యాంకులో కుదువపెట్టి రూ. 30 కోట్ల అప్పు తీసుకున్నారని.. అదో పెద్ద కుంభకోణమని విక్రమ్ ఆరోపించారు. అయితే.. తాను తాటి సతీష్ వద్ద రూ. 2 కోట్లు అప్పు తీసుకుని, అందులో ఇప్పటి వరకు రూ. 70 లక్షలు తిరిగి చెల్లించినట్టు రియల్టర్ సాంబశివరావు ఫోన్‌లైన్‌లో మాట్లాడుతూ తెలిపారు. 60 రోజుల క్రితం మంత్రి ముఖేష్‌గౌడ్ మనుషులు వచ్చి బలవంతంగా వాళ్ల ఇంటికి తీసుకెళ్లి, తన కొడుకును చంపేస్తామని బెదిరించి కాగితాలు రాయించుకున్నారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను విక్రమ్‌గౌడ్ ఖండించారు. కేవలం రూ. 25 లక్షలు చెల్లించేందుకు నెలలు గడువు తీసుకుంటే మిగిలిన మొత్తం ఎప్పుడు చెల్లిస్తావని మాత్రమే అడిగినట్టు విక్రమ్‌గౌడ్ పేర్కొన్నారు. తన బాకీ చెల్లించకపోతే చట్టపరంగానే వసూలు చేసుకుకుంటానని.. ఇకముందు తాను కానీ, తన అనుచరులు కానీ ఎవ్వరూ బకాయి డబ్బు అడుగరని భరోసా ఇచ్చారు. తీసుకున్న అప్పునకు సంబంధించి తనవద్ద ఉన్న పత్రాల ఆధారంగా కోర్టుకు వెళ్లి న్యాయపరంగానే వసూలు చేసుకుంటానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vinayaka chavithi subhakanshalu
Paracetamol face hearing loss  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles