New visa processing norms for indians

New visa processing norms for Indians,US Embassy, US visa processing system, Indians applying for US visa

New visa processing norms for Indians

visa.gif

Posted: 09/06/2012 04:38 PM IST
New visa processing norms for indians

New visa processing norms for Indians

అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు శుభవార్త. వీసా జారీ ప్రక్రియలో ఇబ్బందులను తొలగిస్తూ సరళతరమైన కొత్త వీసా ప్రాసెసింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు అమెరికా దౌత్య కార్యాలయం (ఎంబసీ) ప్రకటించించింది. ఫీజు చెల్లింపు, అపాయింట్‌మెంట్ షెడ్యూల్ ప్రక్రియను సరళతరం చేసినట్లు తెలిపింది. ఈ నెల 26 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని అమెరికా ఎంబసీకి చెందిన మినిస్టర్ కౌన్సెలర్ (దౌత్య వ్యవహారాలు) జూలియా స్టాన్లీ ప్రకటించారు. వీసా దరఖాస్తుదారులకు ఇకపై ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఈటీఏ-ఆన్‌లైన్ బ్యాంకింగ్), లేదా మొబైల్ ఫోన్‌ల ద్వారా ఫీజును చెల్లించవచ్చు. వీసా డాక్యుమెంట్‌లను దేశం మొత్తం మీద ఉన్న 33 పికప్ కేంద్రాల నుంచి అందుకోవచ్చు.

మొదటిసారిగా వీసా కోసం దరఖాస్తు చేసేవారు తమ అపాయింట్‌మెంట్ షెడ్యూల్ ఖరారు కోసం ఆన్‌లైన్‌లో లేదా ఫోన్ ద్వారా కాల్ సెంటర్‌ను సంప్రదించొచ్చు. కాల్‌సెంటర్ ప్రతినిధులు దరఖాస్తుదారుల ప్రశ్నలకు ఇంగ్లిష్‌తో పాటు హిందీ, పంజాబీ, గుజరాతీ, తెలుగులో సమాధానం ఇచ్చే సదుపాయం ఉంది. వీసా ఫీజును యాక్సిస్, సిటీ బ్యాంక్‌లకు చెందిన 1,800కు పైగా బ్రాంచీలలో నగదు రూపంలో చెల్లించవచ్చు. తొలిసారి అపాయింట్‌మెంట్ కోరే వాళ్లు ఆఫ్‌సైట్ కేంద్రం వద్ద వేలిముద్రల కోసం ఒకటి, ఎంబసీ లేదా కాన్సులేట్స్ వద్ద కాన్సులర్ ఇంటర్వ్యూ కోసం మరొకటి మొత్తం రెండు అపాయింట్‌మెంట్‌ల కోసం షెడ్యూల్ ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని, ప్రస్తుత వ్యవస్థతో పోలిస్తే ఇదే ప్రధాన వ్యత్యాసమని కూడా ఆమె వివరించారు. వీసాలను రెన్యువల్ చేసుకునే దరఖాస్తుదారులు ఒకసారికంటే ఎక్కువసార్లు వేలిముద్రలను ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

అర్హులైన వారందరికీ పదేళ్ల వ్యవధికి జారీచేసే బహుళ ప్రవేశ వీసాలను అమెరికా కొనసాగిస్తూనే ఉంటుందని స్టాన్లీ చెప్పారు. భారత్‌లో యూఎస్ వీసా దరఖాస్తుదారులకు 10 రోజుల కంటే తక్కువ వ్యవధిలో అపాయింట్‌మెంట్ ఖరారు చేస్తున్నామని, ఇంటర్వ్యూ తర్వాత వారంలోపే వీసాలను చేతికందిస్తామన్నారు. అమెరికా ఎంబసీ ఏటా 7 లక్షల దరఖాస్తులను ప్రాసెస్ చేస్తోందని, ఇందులో అధికసంఖ్యలో దరఖాస్తుదారులు వీసాలను పొందుతున్నారని ఆమె అన్నారు. అమెరికాలో యూనివర్సిటీలు మూతపడుతుండటం వల్ల భారతీయ విద్యార్థులపై ప్రభావం పడుతున్న అంశంపై స్పందిస్తూ... విద్యార్థులు వర్సిటీలను ఎంపిక చేసుకునేందుకు ఎంబసీలోని ఎడ్యుకేషన్ కార్యాలయం సేవలను వినియోగించుకోవాలని స్టాన్లీ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brazil government grants gay man maternity leave
Ac stolen from botsa jhansi house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles