Brazil government grants gay man maternity leave

Brazil government grants gay man 'maternity' leave, brazil, gay dads, adoption, maternity leave, paid leave, benefits, lucimar da silva

Brazil government grants gay man 'maternity' leave

Brazil.gif

Posted: 09/06/2012 05:04 PM IST
Brazil government grants gay man maternity leave

Brazil government grants gay man 'maternity' leave

బిడ్డను పెంచుకుంటున్న తమకు ప్రసూతి సెలవు కావాలని న్యాయ పోరాటం చేసిన ఇద్దరు పురుష స్వలింగ సంపర్కులు (‘గే’లు) ఎట్టకేలకు విజయం సాధించారు. ఉద్యోగాలు చేస్తున్న స్వలింగ సంపర్కులకూ హక్కులుంటాయన్న విషయాన్ని కోర్టు గుర్తించినందుకు వీరిద్దరూ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. కోర్టు ఆదేశం మేరకు లూసీమార్ డీ సిల్వా ప్రసూతి సెలవు పొందిన తొలి తండ్రిగా బ్రెజిల్‌లో చరిత్ర సృష్టించాడు. రెండేళ్ల క్రితం డిసిల్వా, అతని భాగస్వామి రాఫెల్ గెర్‌హార్డ్ ఓ బిడ్డను దత్తత తీసుకున్నారు. ఈ బిడ్డ సంరక్షణ బాధ్యతను చూసుకునేందుకు తమలో ఎవరో ఒకరికి ప్రసూతి సెలవు కావాలంటూ ఈ స్వలింగ సంపర్కులిద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఇద్దరిలో ఎవరో ఒకరికి ప్రసూతి సెలవు ఇవ్వకుంటే అది వివక్షే అవుతుందని బ్రెజిల్‌లోని సామాజిక భద్రతా సంస్థ భావించింది. పురుషులకు ప్రసూతి సెలవు కేటాయించడం అసహజమే అయినప్పటికీ, బిడ్డ సంరక్షణకు తండ్రి ఎప్పుడు సమయం కేటాయించాలన్న ప్రశ్న ఉదయిస్తుందని ఆ సంస్థ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని కోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే ఈ తీర్పు న్యాయపరమైన ఆనవాయతీ కాదని, ఇది రాబోయే కేసుల్లో వర్తించదని ఆ సంస్థ పేర్కొన్నట్లు బ్రెజిల్‌కు చెందిన ‘ఓ గ్లోబో’ టీవీ ఛానల్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రసూతి సెలవుల వంటి సౌకర్యాలు, హక్కులు పొందాలనుకునే స్వలింగ సంపర్కులు ఎవరికి వారు కోర్టును ఆశ్రయించాల్సి ఉం టుంది. ప్రసూతి సెలవుపై న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పుతో పౌరులుగా తమ హక్కులను ప్రభుత్వం గుర్తించినట్లయిందని బ్రెజిల్‌లో ‘గే’ల సంక్షేమానికి పోరాడుతున్న కార్లోస్ టఫెసన్ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Namburi srimannarayana house fire accident in kovur
New visa processing norms for indians  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles