5 indian techies killed in us road accident

Indian software professionals, car accident in US, world news

Five people hailing from Andhra Pradesh died in a car accident late on Thursday in Oklahoma City, U.S., according to reports.

5 Indian techies killed in US road accident.png

Posted: 08/11/2012 11:21 AM IST
5 indian techies killed in us road accident

road_accidentఅమెరికా నగరంలోని ఓక్లహామా నగరంలోని రోడ్లు భారతీయుల రక్తంతో తడిసిపోయాయి. ఓక్లహామా నగరంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురువారం అర్థరాత్రి ఒంటిగంటకు జరిగింది. వీరందరూ షవర్లె కారులో ఇంటర్ స్టేట్ రహదారి నుండి ఐ-35 వైపు తిరుగుతూ అదుపుతప్పి ఆగివున్న భారీ వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  కారు పై బాగం పూర్తిగా విడిపోయి కారు భారీ వాహనం కిందకు దూరిపోయింది. కారుకు మంటలు అంటుకున్నాయి. దాంతో ఆ ఐదుగురూ అక్కడికక్కడే మరణించారు.

ప్రమాదంలో మృతిచెందిన వారిలో ఒకరు ఖమ్మంజిల్లాకు చెందినవారు కాగా, మరొకరు హైదరాబాద్ వాసి అని, మిగతా ముగ్గురూ కూడా హైదరాబాద్ పరిసరప్రాంతాల వారేనని తెలిసింది.. వారంతా సాప్ట్ వేర్ ఇంజనీర్లనేనని, వారి పేర్లను పోలీసులు తెలిపారు. జస్వంత్ రెడ్డి, గాదె ఫణీంద్ర, అంతటి అనురాగ్, శ్రీనివాస్, వెంకట్ గా గుర్తించారు వీరిలో వెంకట్ కి వివాహం అయింది. మిగతా వారంతా అవివాహితులేనని సమాచారం. వీరి మృతదేహాలను భారత దేశానికి పంపించడానికి తానా టీమ్ స్క్వేర్ అన్ని యత్నాలూ చేస్తున్నట్టు తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర తెలియజేశారు. చేతికి అందివచ్చిన కొడుకులు ఇలా ప్రమాదంలో మరణించడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pm is against telangana mp madhu yashki
Pjr daughter vijaya reddy to join ysr congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles