Godavari river flood

godavari river flood

godavari river flood

1.gif

Posted: 07/26/2012 11:49 AM IST
Godavari river flood

     వర్షాభావంతో వట్టిపోతుందనుకున్న గోదావరి నదిలోకి నీటి ప్రవాహం పెరిగింది. గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో ఇన్ ప్లో  క్రమేపీ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద 45అడుగులకు గాను నీటి మట్టం పూర్తిగా నిండుకుంది. నిన్న 99వేల godavariక్యూసెక్కులు వచ్చి చేరిన నీరు నేడు లక్షా 90వేలకు చేరింది. దీంతో అంతే మొత్తంలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇందుకోసం ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ 175గేట్లను 30నుంచి 40సెంటీమీటర్ల మేర ఎత్తారు. రేపటికి ఇన్ ప్లో మరింత పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులకు కేంద్ర జలసంఘం నుంచి సమాచారం అందింది. మిగులు జలాల విడుదలతో ధవళేశ్వరం బ్యారేజీ దిగువన ఉన్న వశిష్ట, గౌతమీ, వైనతేయ నదులలో నీటిమట్టం పెరిగింది. ఇదిలా వుంటే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ప్రధాన పంట కాల్వల ద్వారా గోదావరి డెల్టా భూములకు 10500క్యూసెక్కుల నీరు అందుతోంది. ఈ సీజన్లో గోదావరిలో వరద నీటి మట్టం పెరగడం ఇదే ప్రధమం. దీంతో అఖండ గోదావరి జలకళతో కళకళలాడుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద 30అడుగులకు నీటిమట్టం చేరింది.
  godavari_e  కాగా, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో 40అడుగులకు కూడా చేరే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయితే 43అడుగులకు చేరితే సమీప ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తూ మొదటి ప్రమాద హెచ్చరిక ఎగరవేస్తారు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరుగుతే ప్రమాదం అని అన్నారు. ఇక ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా వరద నీరు పూర్తి స్థాయిలో వచ్చి చేరుతున్నా ఇప్పడే పెద్ద ప్రమాదం కనిపించడం లేదు. మూడు వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అంతే నీటిని బయటకు వదులుతున్నారు. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Psycho sambha fear
Rains in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles