Psycho sambha fear

psycho sambha fear

psycho sambha fear

11.gif

Posted: 07/26/2012 12:40 PM IST
Psycho sambha fear

      మళ్లీ సైకో సాంబ ఆయా జిల్లా వసుల గుండెల్లో నిద్రపోతున్నాడు. ఎందుకంటే.. తాజాగా నెల్లూరు జిల్లా తడ సమీపంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులపై దాడికి పాల్పడి ముగ్గురిని పొట్టనుపెట్టుకున్న ఉన్మాదిని సైకో సాంబాగా పోలీసులు అనుమానించటమే దీనికి sambaకారణం. ఆ దిశగా విచారణ కూడా జరుపుతున్నారు. ఇటీవలే కొండపల్లి సమీపంలో పోలీసుల నుంచి సాంబా తప్పించుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి అతని కోసం భారీ ఎత్తున పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. తాజా ఘటనతో స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు పోలీసులు ఉన్మాది కోసం గాలిస్తున్నారు. కాగా ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి ప్రకాశం జిల్లా ఉలవపాడుకు చెందిన రమేష్ గా పోలీసులు గుర్తించారు. అతను ప్రస్తుతం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో కావలికి చెందిన నిరంజన్, ఒడిశా మల్కాన్ గిరి జిల్లాకు చెందిన అజయ్ బిశ్వాస్, ఒంగోలుకు చెందిన రాంబాబు ఉన్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాజా సంఘటనలతో నెల్లూరు ప్రకాశం జిల్లాలో సైకో సాంబా పేరు ప్రజల నోళ్లలో నానుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian ifs officer arrest in america
Godavari river flood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles