రంజాన్ మాసం వచ్చిందంటే .. హిందు, ముస్లీం బేధం లేకుండా ప్రతి ఒక్కరి గుర్తుకు వచ్చేది.. పవిత్రమైన హాలీం. రంజాన్ ముస్లీం సోదరుల పండగ అయినప్పటికి.. వారు ఇస్తే ఇప్తార్ విందులో హలీమ్ ఒక ముఖ్యమైనది. ఈ హాలీం కోసం కులమత బేధాలు లేకుండా ప్రజలందరు ఎంతో ఇష్టంగా తింటారు. ముస్లిం సోదరులు ఎంతో పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసం రాకతో రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ సందడి నెలకొంది. రంజాన్ ఉపవాస దీక్షల సమ యంలో ముస్లింలు ఎంతో ప్రీతిపాత్రంగా భావించే హలీమ్‌కు ఎంతో ప్రాధా న్యత ఉంది. ఇఫ్తార్ విందు కోసం ఈ హలీమ్‌ను ముస్లిం సోదరులు ఉపవాసం తరువాత తినడం ఆనవాయితీ. ఎన్నో సంవత్సరాలుగా ఈ హలీమ్‌ను ఎంతోమంది ఇప్పటికీ ఇష్టపడుతున్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే హలీమ్ తయారీ అవుతోంది. రంజాన్ మాసంలో నోరూరించే హలీమ్ తినేవారి కోసం సరికొత్త రుచులు అందుబాటులోకి వస్తున్నాయి. రంజాన్ ఉపవాసదీక్షలు చేస్తున్న ముస్లిం సోదరుల కోసం వెరెైటీ హలీంలను రెస్టారెంట్ల నిర్వాహకులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాలకు సైతం మన హలీం సరఫరా అవుతోంది. భాగ్యనగరంలో ఎంతో పేరుపొందిన పిస్తాహౌస్ హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబాయి, చెనె్నై, బెంగుళూరు వంటి ప్రాంతాలకు గాటి ద్వారా సరఫరా చేస్తోంది. వీక్లీ బేసిస్‌లో విజయవాడ, కోయంబత్తూరులకు కూడా అందిస్తోంది. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో టేక్ అవే సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ డెలివరీ డాట్‌కామ్ ప్రత్యేకంగా హలీమ్‌ను ఇంటివద్దకే డోర్ డెలివరీ అందిం చేందుకు ముందుకువచ్చింది. ఒక్క ఎస్ఎంఎస్ ద్వారా మీకు నోరూరించే హలీమ్‌ను ఇంటి వద్దకే తీసుకువస్తోంది. రంజాన్ మాసం మొత్తం 55342 ద్వారా ఎస్ఎంఎస్ చేసిన వినియోగదారులకు ఈ హలీమ్ రుచులను అందించ నుంది. జంటనగరాల్లోని ప్రజలు 77990-92345, 040-64632345 ఫోన్ నెంబరు ద్వారా కానీ www. hyderabaddelivery.com ద్వారా కానీ హలీం కోసం ఆర్డర్ చేయవచ్చని హైదరాబాద్ డెలివరీ డాట్ కామ్ ఆపరేషన్స్ మేనేజర్ రాజా వెంకట్ తెలిపారు. టెలిబుకింగ్ ద్వారా హలీంకు అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. తమ డాట్ కామ్ ద్వారా కేక్స్, బొకేలు, రెస్టారెంట్ ఫుడ్, మూవీ టికెట్లు, గ్రాసరీస్, స్వీట్స్, ఫ్రూట్స్ డెలివరీ చేస్తున్నట్లు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more