Captain lakshmi sehgal passes away

Captain Lakshmi Sehgal passes away

Captain Lakshmi Sehgal passes away

Lakshmi.jpg

Posted: 07/23/2012 01:38 PM IST
Captain lakshmi sehgal passes away

Captain Lakshmi Sehgal passes away

ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు కెప్టెన్  లక్ష్మీ సెహగల్   కన్నుమూశారు. అక్టోబర్ 24, 1914న స్వామినాథన్  అమ్ముకుట్టీల దంపతులకు మద్రాసులో జన్మించిన  సెహగల్ వైద్య విధ్యను అభ్యసించారు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె ఇటీవల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఆమె ఇప్పటి వరకు స్పహలోకి రాలేక పోయారని, మందులకు కూడా స్పందించలేక తుది శ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌తో కలిసి పని చేసిన సెహగల్ ఆజాద్ హిందూ ఫౌజ్‌లో కీలక పాత్ర పోషించారు. ఆమె చేసిన సేవలకు కల్నల్ ర్యాంకు లభించింది. 2002లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి అబ్దుల్‌ కలాంపై వామపపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమెకు 1998లో ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇచ్చింది. 1940లో డాక్టర్ లక్ష్మీ సెహగల్ సింగపూర్‌లో సైనికులకు వైద్య సహాయం అందించే వారు. అదే సమయంలో సుభాష్ చంద్రబోసు పిలుపు మేరకు ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంటులో చేరి సెహగల్ సేవలందించారు. భారత్‌కు తిరిగి వచ్చాక 1971లో సిపిఎంలో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1947లో లాహోర్‌కు చెందిన కల్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్‌తో వివాహం అయ్యాక ఆమె కాన్పూర్‌లో స్థిరపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gati joins hands with pista house for supply of fresh hyderabadi haleem
Brazil is the biggest exporter of indian breeds of cows  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles