Toli ekadasi festival

toli ekadasi festival,

toli ekadasi festival

ekadasi.gif

Posted: 06/30/2012 11:22 AM IST
Toli ekadasi festival

toli ekadasi festival

అచంచలమైన భక్తి విశ్వాసాలతో శ్రీమన్నానారాయణుడ్ని సేవించడానికి మునులు ఋషులు, తపోధనులు, చూపిన మహా పర్వదినాలలో ఏకాదశి ఒకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి ఇలా పలుపేర్లతో పిలుచుకొంటున్న ఈ ఏకాదశీ వ్రతం అత్యంత శ్రేష్ఠమైంది. భగవంతుని సాక్షాత్కారాన్ని నేరుగా పొందడానికి ఏకాదశి వ్రతం ఎంతగానో ఉపయుక్తం.పవిత్ర ఆధ్యాత్మిక ముక్తదినం అయిన ఈ ఏకదశిని నే హరి ఏకాదశి అని అంటారు. ఆషాడమాస ఏకాదశియే తొలి ఏకాదశి . దీనినే శయనైకాదశి అనీ అంటారు. ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకునే ఈ ఏకాదశీ పర్వదినం నాడు మహావిష్ణువు క్షీరాబ్ది లో శయనిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ప్రత్యేకం. నిండైన భక్తితో ఆహారపదార్థాలైన అన్నం లాంటి వాటిని సేవించకుండా ప్రతిక్షణమూ శ్రీమన్నానారాయణ మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే భక్తవత్సలుడైన శ్రీహరి ముక్తి మోక్షాలనుప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. ఈ వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించిన వారికి సమస్త బాధలనుంచి ఉపశమనం కలుగుతుందని అంటారు.

ఎవరైతే నారాయణ మంత్రాన్ని అనునిత్యం జపిస్తుంటారో వారికి ఈ లోకపు సంపదలతో పాటుగా వైకుంఠప్రాప్తి కూడా కలుగుతుంది. సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వ్రతం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరిపురంలో తొలేకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు. ఈ రోజు తెల్లవారు ఝాముననే అభ్యంగన స్నానపానాదులను చేసి బ్రహ్మచర్య దీక్ష వహించి సదా శ్రీహరినే ధ్యానించాలి. ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయని చెప్తారు. ఈ వ్రతాచరణలో విష్ణ్భుగవానుడు అలంకారప్రియుడు కనుక పూలతో సుగంధ ద్రవ్యాలతో మహావిష్ణువును అమితశోభాయమానంగా అలంకరిస్తారు. పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీ శుద్ధ ఏకాదశి వరకు మహావిష్ణువు పాలసముద్రంలో శయనిస్తాడు. ఈ కాలంలో నియమ నిష్ఠలతో, ఆహారవిహారాది నియమాలతో, నియమబద్ధ జీవనం గడిపేవారు శ్రీహరికి ప్రీతి పాత్రులౌతారని శాస్త్ర వచనం. ఈ దినాన వైష్ణవాలయాల్లో జాజిపూలతో స్వామికి పవళింపుసేవోత్సవం జరుపుతారు.

గోదావరి జిల్లాలో పాలెళ్ల పండుగలా ఈ తొలికాదశిని నిర్వహింపచేస్తారు. కొత్త పాలేర్లను పనిలోకి తీసుకోవడం , వారికి పంచభక్షపరమాన్నలతో విందుచేయడం, కొత్తబట్టలను ఇచ్చి గౌరవించడం లాంటి ఆచారం అక్కడ ఉంది. నెల్లూరు ప్రాంతంలో వ్యవసాయపు పనులు మొదలుపెడ్తారు. పేలపిండిని కూడా ఈ రోజు ఏకాదశి సందర్భంగా భగవంతునికి నివేదించి దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ తొలి ఏకాదశిన గోపద్మవ్రతం చేస్తారు. ఈ వ్రతాచరణలో గౌరమ్మను వినాయకుడ్ని పూజిస్తారు. నోమును ఐదు ఏళ్లు ఆచరించి ఉద్యాపన చేస్తారు. పసుపు, కుంకుమ, గాజులు, బట్టలు, స్వయంపాకం, నువ్వుపిండి  ముతెతైదువలకు ఇచ్చి నమస్కరిస్తారు. గణపతికి ఉండ్రాలు నివేదిస్తారు. తులసికోట వద్ద పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి జామ, ఖర్జూర, చెరుకు, సీతాఫలాలను నివేదిస్తారు. సేవాభావం, పరులను గౌరవించడం లాంటి నియమాలను పాటించడం ఈ వ్రతాచరణలో ముఖ్యమని అంటారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra agrochemical plant fire
Ap government hikes da of its employees and pensioners  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles