Aamir invited to parliament

Aamir Khan , Sansad, Satyamev Jayate, Parliament, Sansad Bhavan, Foreign Direct Investment, pharmaceutical, Shanta Kumar, Rajeev Shukla, Emraan Hashmi , Rakhi Sawant

Trust Aamir Khan to go where no other Bollywood star has. As his show Satyamev Jayate makes waves, the 47-year-old has now become the first non-MP Bollywood actor to be invited to the Parliament

Aamir invited to Parliament.gif

Posted: 06/20/2012 04:37 PM IST
Aamir invited to parliament

Aamir-khanప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ ఫర్ ఫెక్ట్ అయిన అమీర్ కూడా పార్లమెంటుకు వెళ్ళబోతున్నాడు. ఇటీవల సచిన్, రేఖ లాంటి వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై పార్లమెంటులో అడుగు పెట్టారు. అమీర్ ఖాన్ కూడా వాళ్ళ లాగే రాజ్యసభ సభ్యుడు అయి పార్లమెంటులో అడుగుపెడుతున్నాడనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఎలాంటి సభ్యత్వం లేకుండానే అమీర్ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నాడు.

ఎలా అంటే...  'సత్యమేవ జయతే' టీవీ షోతో అమీర్‌ఖాన్ వెల్లడిస్తున్న విషయాలపై ఆసక్తి చూపుతున్న ఎంపీలు అమీర్‌ను కలుసుకోవాలని, ఎపిసోడ్ల నిర్మాణంలో ఆయన అనుభవాలను పంచుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ మేరకు ఒక పార్లమెంటరీ బృందం ఆయనను ఆహ్వానించింది. వాణిజ్యంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్, బీజేపీ రాజ్యసభ ఎంపీ శాంతకుమార్ అమీర్‌కు ఈ ఆహ్వానాన్ని పంపారు. గురువారం జరిగే ఈ సమావేశానికి అమీర్ హాజరవుతారని ఆయన ప్రతినిధి తెలిపారు. ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్‌లో అమీర్ వైద్య వృత్తిలో జరుగుతున్న అవకతవకలను ఎత్తి చూపిన సంగతి తెలిసిందే. వైద్యులు చిన్నచిన్న రోగాలకు కూడా ఆపరేషన్లు చేసి పేషెంట్ల సొమ్మును దోచేస్తున్నారని, అత్యవసర ఔషధాలను విపరీతమైన ధరలకు అమ్ముతున్నారని అమీర్ ఈ ఎపిసోడ్‌లో ఆరోపించారు. దీనిపై మండిపడిన భారతీయ వైద్య మండలి అమీర్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసింది. కానీ అమీర్ ఖాన్ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెప్పడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Foreign bank accounts of chandra babu
Kashi vishwanath temple to get facelift  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles