By election no voting

by election no voting, YSR Cogress Party, TDP party, Congress party, No voting,

by election no voting

election.gif

Posted: 06/13/2012 08:23 PM IST
By election no voting

రెండు ప్రధాన పార్టీల  అభ్యర్థులకు  తాము పోటీ చేస్తున్న  నియోజక వర్గంలో  ఓటు లేకపోవడం విచిత్రం. రాయదుర్గం నియోజకవర్గానికి  జరిగిన ఉప ఎన్నికల్లో  వైఎస్ఆర్ సీపీ  అభ్యర్థిగా  కాపు రామచంద్రారెడ్డి  టీడీపీ అభ్యర్థిగా  దీపక్ రెడ్డి  పోటీ చేయడం తెలిసిందే.  అయితే  వీరిద్దరికీ  రాయదుర్గం నియోజకవర్గ పరిదిలో  ఓటు హక్కు లేదు. కాపు రామచంద్రా రెడ్డికి  కళ్యాణ దుర్గం మండలం  నాగిరెడ్డి పల్లిలో  ఓటు ఉంది.  ఇక దీపక్ రెడ్డి  నెల్లూరు  జిల్లా వాసి కాగా ప్రస్తుతం  బళ్లారిలో  ఉంటున్నారు.  ఈయనకు  జిల్లాలో ఓట హక్కు లేదు.  తమకు ఓటు  వెయ్యమని  ఓటర్ల చుట్టూ తిరిగిన వీరిద్దరికీ  నియోజకవర్గంలో  ఓటు  హక్కు లేకపోవడంపై  ప్రజలు ఆసక్తిగా  చర్చించుకుంటున్నారు.   అలాగే  నెల్లూరు  ఎంపీ  కాంగ్రెస్  అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డికి ,  రామచంద్రపురం టీడీపీ అభ్యర్థి చిక్కాల  రామచంద్రరావుకు  కూడా వారు పోటీ చేస్తున్న చోట  ఓటు లేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Automatic electric samrat bed
Fire accident in exhibition at kukatpally metro  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles