Fire accident in exhibition at kukatpally metro

Fire accident in Exhibition at Kukatpally Metro

Fire accident in Exhibition at Kukatpally Metro

Fire accident in Exhibition at Kukatpally Metro.gif

Posted: 06/13/2012 01:01 PM IST
Fire accident in exhibition at kukatpally metro

Fireహైదరాబాద్ లో రోజురోజుకు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ లేకపోవడమే కారణం అంటున్నారు. తాజాగా కూకట్ పల్లిలోని మెట్రో ప్రక్కన గల ఎగ్జిబిషన్ లో షాట్ సర్క్యూట్ కారణంగా పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎగ్జిబిషన్ లోని దాదాపు 100 కు పైగా స్టాళ్ళు, ఎగ్జిబిషన్ ప్రక్కనే పార్క్ చేసి ఉన్న 4 వాహనాలు కూడా కాలి బూడిద అయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా ఆ పరిసర ప్రాంతాలలో దట్టమైన పొగ ఆవరించింది. ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగక పోయినా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో ముంబై హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

అయితే అక్కడి స్థానికులు మాత్రం ఎగ్జిబిషన్ నిర్వహకులు సరైన ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఇది జరిగిందని, ఇక్కడి జీహెచ్ఎంసీ అధికారులు కూడా లంచాలు తీసుకొని అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారని అన్నారు. ఈ ప్రమాదానికి అధికారుల బాధ్యత కూడా ఉందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  By election no voting
Jagan reddy to stay in jail during andhra by poll  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles