Uk pm cameron leaves 8 year old daughter in pub

UK PM Cameron leaves 8-year-old daughter in pub

UK PM Cameron leaves 8-year-old daughter in pub

UK.gif

Posted: 06/12/2012 01:46 PM IST
Uk pm cameron leaves 8 year old daughter in pub

UK PM Cameron leaves 8-year-old daughter in pub

బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామరూన్‌ తన ఎనిమిదేళ్ల కూతురుని పబ్‌ లో మరిచి కుటుంబంతో సహా ఇంటికి వెనుదిరిగిన సంఘటన లండన్‌లోని కంట్రీ పబ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కామరూన్‌ తన కుటుంబ సభ్యులు ఇతర స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి వెళ్లారు తిరిగి ఇంటికి బయలు దేరారు. హడావిడిగా ఇంటికి చేరుకోగా కామెరూన్‌ ఎనిమిదేళ్ల కూతురు నాన్సీని పబ్‌లోనే విడిచివచ్చినట్టుగా గమనించారు. వెంటనే కామెరూన్‌ పబ్‌ చేరుకొని తన నాన్సీ గురించి ఆరా తీయగా పబ్‌ సిబ్బంది నాన్సీని చేరదీసి సురక్షితంగా ఉంచారు. ప్రచురితమైన సన్‌ టాబ్లాయిడ్‌ కథనం ప్రకారం ప్రధాని కామరూన్‌, ఆయన భార్య సమంతా ఇరువురు ఇంటికి చేరుకున్నాక నాన్సీ కనపడకపోవడంతో చాలా ఆందోళనకు గురయ్యారని పేర్కొంది.

వెంటనే అధికారులు పబ్‌కు ఫోన్‌ చేయగా నాన్సీ సురక్షితంగా తమ వద్దే ఉందని తెలుపగా అందరూ ఊపిరిపీల్చుకున్నారు.కామెరూన్‌ వెంటనే పబ్‌కు చేరుకుని నాన్సీని కలుసుకున్నారు.అయితే అంతకు ముందు కుటుంబ సభ్యులతో సహా ‘ప్లఫ్‌ ఇన్‌’ పబ్‌లో భోజనం చేసి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో నాన్సీ పబ్‌ టాయ్‌లెట్‌లో ఉండి పోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. కామెరూన్‌కి మొత్తం నలుగురు సంతానం నాన్సీ, ఆర్థర్‌,సిక్స్‌,22 నెలల ఫ్లోరెన్స్‌. అయితే పబ్‌లో భోజనం అనంతరం కామెరూన్‌ అతని సంతానం వేర్వేరు వాహనాల్లో బయలు దేరడంతో భద్రతా సిబ్బంది సమన్వయ లోపం కారణంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.కామెరూన్‌ తిరిగి పబ్‌కు వెళ్లగా నాన్సీ సురక్షితంగా ఉండడంతో పబ్‌ సిబ్బంది పట్ల సంతోషం వెలిబుచ్చారు. అయితే ఈ మొత్తం సంఘటన మొత్తం జరిగిన కాల వ్యవధి కేవలం 15 నిమిషాలే కావడం మరో విశేషం...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bangalore students build car with 240kmpl mileage
Two officials held for influencing voters in ongole  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles