Missing starlet laila khan recced mumbai for let

Laila Khan, Wafaa, Lakhkar-e-Taiba, LeT, Azmina Patel, Mumbai, Asif Sheikh, terror Attacks

It has come to light that Laila Khan, the Bollywood starlet who has been missing since last year, recced Mumbai in 2011 along with her stepfather, sister and a family friend, and provided maps and photographs from the trip to the Pakistan-based terror outfit Lakhkar-e-Taiba (LeT), which was then planning a terror attack in the city.

Missing starlet Laila Khan.gif

Posted: 06/08/2012 04:48 PM IST
Missing starlet laila khan recced mumbai for let

Lila-Khanఉగ్రవాద మూలాలు బాలీవుడ్‌కూ విస్తరించాయి. సంవత్సరకాలంగా కనబడకుండా పోయిన బాలీవుడ్ నటి లైలాఖాన్‌కు లష్కరేతాయిబాతో ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. నిఘావర్గాల దర్యాప్తులో ఉగ్రవాదులతో ఆమెకున్న లింకులు బహిర్గతమవుతున్నాయి. భారత్‌లో భారీ విధ్వంసానికి ప్రణాళికలు సిద్ధం చేసిన లష్కరేతాయిబా ఉగ్రవాదులకు ఆమె అండగా నిలిచిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ముంబైలోని పలుప్రాంతాలకు సంబంధించిన ఫొటోలు, ఇతర సమాచారాన్ని ఉగ్రవాదులకు చేరవేసిందని జమ్మూకాశ్మీర్ డీఐజీ కబీర్‌దాస్ వెల్లడించారు.

అంతేకాక 2011లో ఢిల్లీ హైకోర్టువద్ద జరిగిన బాంబుదాడి కోసం ఉపయోగించిన కారు లైలాఖాన్‌దేనని ఆయన తెలిపారు. లైలాతో పాటు ఆమె అక్క అజ్మినా పటేల్, సవతి తండ్రి అసిఫ్ షేక్, లష్కరేతాయిబాతో సంబంధాలున్న స్నేహితుడు పర్వేజ్ ఇక్బాల్ ఉగ్రవాదులకు సహాయమందించిన వారిలో ఉన్నారు. లైలా బృందం ఢిల్లీలో ఎల్ఈటీ సభ్యులు వాసిమ్, యాసిన్, గులాంను కలుసుకుని భవిష్యత్ వ్యూహాలపై చర్చలు జరిపారు. ఢిల్లీ పేలుడు తర్వాత ముంబైలో పేలుళ్లకు పథకం రచించారు. కానీ, నిఘావర్గాలకు సమాచారమంది పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

మూడేళ్లక్రితం బంగ్లాదేశీ తీవ్రవాద సంస్థ హుజీ సభ్యుడు మునిర్‌ఖాన్‌ను లైలా వివాహం చేసుకుంది. దీంతో ఆమెకు ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. భర్తద్వారానే ఆమెకు ఎల్ఈటీతో పరిచయమేర్పడి ఉంటుందని లైలాతో పనిచేసిన సినీ దర్శకుడు రాకేష్ సావంత్ వెల్లడించారు. కాగా.. బాలీవుడ్‌లో తళుక్కుమన్న లైలాఖాన్ 2008లో రాజేష్‌ఖన్నా చిత్రం వఫాలో నటించింది. భవిష్యత్‌తారగా కితాబులందుకున్న ఆమె ఏడాదిక్రితం కుటుంబసభ్యులతో కలిసి అదృశ్యమైపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gps navigation can kill your brain
Mukesh ambani led reliance industries to invest rs 1 lakh crore in 5 years to double profit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles