Pak chief justice recuses himself from sons case

Pak Chief Justice recuses himself from son's case,Iftikhar Muhammad Chaudhry, Malik Riaz, Arsalan Iftikhar,Iftikhar Chaudhry, Arsalan Iftikhar, Malik Riaz Hussain, Pakistan People

Pak Chief Justice recuses himself from son's case

Pak.gif

Posted: 06/08/2012 12:51 PM IST
Pak chief justice recuses himself from sons case

Pak Chief Justice recuses himself from son's case

పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి తన కుమారుడు ఆర్సలన్ ఇఫ్తికార్‌కు సంబంధించిన ఒక కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టులో ఉన్న కేసులను ప్రభావితం చేసేందుకు పారిశ్రామికవేత్త మాలిక్ రియాజ్ హుస్సేన్ నుంచి రూ.400 మిలియన్లు తీసుకున్నట్లు ఆర్సలన్ ఇఫ్తికార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసు విచారణను చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. అయితే ధర్మాసనం ఈ కేసు విచారణను పునఃప్రారంభించినప్పుడు జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి తన నిర్ణయాన్ని వెల్లడించారు. కుమారుడికి సంబంధించిన కేసును విచారిస్తున్న ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి ఉండటాన్ని అంతకుముందు కొందరు న్యాయ నిపుణులు విమర్శించారు. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి ఉండటాన్ని అటార్నీ జనరల్ ఇర్ఫాన్ ఖాదిర్ కూడా తప్పుబట్టారు. అటార్నీ జనరల్ అభ్యంతరంతో పాటు కేసులో ప్రాథమిక విచారణ ముగింపునకు రానుండటంతో కేసు విచారణ నుంచి ఇఫ్తికార్ తప్పుకున్నారు. ‘మీ స్వంత చర్యలకు మాత్రమే మీరు బాధ్యులు. మీ పిల్లల చర్యలకు కాదు.. అని ఖురాన్ చెప్పింది. దేవుడిపై మాకు విశ్వాసం ఉంది’ అని ఇఫ్తికార్ అన్నారు. తన కుమారుడి వృత్తి గురించి కాని వ్యాపారం గురించి కాని తనకు తెలియదని ఆయన వాదించారు. ఈ కేసు విచారణకు ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించి ఆయన కోర్టు హాలులోంచి వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mukesh ambani led reliance industries to invest rs 1 lakh crore in 5 years to double profit
Kareena saif wedding postponed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles