The chess games of bodda pratyusha

The chess games of Bodda Pratyusha,Cyber Chess Academy walked across,

The chess games of Bodda Pratyusha

Pratyusha.gif

Posted: 06/06/2012 10:52 AM IST
The chess games of bodda pratyusha

The chess games of Bodda Pratyusha

ప్రత్యూష వయస్సు 16 సంవత్సరాలు. విశాఖ జిల్లా పాయకరావుపేట లోని శ్రీప్రకాష్ విద్యాసంస్ధలో 10వ తరగతి చదువుతోంది. చదరంగం చిచ్చర పిడుగు బొడ్డా ప్రత్యూష ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించింది. గత నెల 29వ తేదీ నుంచి ఈనెల 5వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో ఒడిశా ఇంటర్నేషనల్ ఓపెన్ గ్రాండ్ మాస్టర్ టోర్నమెంటు జరిగింది. ఇందులో దేశంలోని 262 మంది చదరంగం క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రత్యూష 10 పాయింట్లకు 6 పాయింట్లు సాధించి, మూడవ నార్మ్ సొంతం చేసుకుంది. 2010 లో భువనేశ్వర్‌లో, 2011లో చెన్నైలో జరిగిన పోటీల్లోనూ ఈమె నార్మ్‌లు సాధించింది. మూడు సార్లు నార్మ్ సాధించడంతో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించేందుకు అవకాశం కలిగింది. ఈ టైటిల్‌ను గతంలో దేశంలో 17 మంది సాధించగా, తక్కువ వయస్సులో టైటిల్ సాధించింది ప్రత్యూష మాత్రమే.. మూడు నార్మ్‌లు సాధించినట్లు ఇంటర్నేషనల్ చెస్ అసోసియేషన్‌కు ప్రత్యూష ధరఖాస్తు చేస్తే, ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించినట్లు మరో నాలుగు నెలల్లో అధికారిక ప్రకటన వస్తుంది.


 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi jd lakshminarayana gets fan clubs
Gum karaya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles