Gum karaya

Gum karaya, Chemically, gum karaya is an acid polysaccharide composed ,Gum Karaya trees are also found in Australia, Pakistan, Panama, Phillippines

Gum karaya

Gum.gif

Posted: 06/06/2012 10:46 AM IST
Gum karaya

Gum karaya

అనేక రకాలుగా ఉపయోపగపడే గమ్‌కరియా (జిగురు)కు అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పలుకుతోంది. దీంతో గిరిజన సహకార సంస్థ (జిసిసి)కు ఇది కాసులు పండిస్తోంది. నిత్యం వాడే పేస్ట్, స్వీట్లు, మందుల తయారీలో మిశ్రమంగా ఉపయోగించే గమ్‌కరియా రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాల్లో విరివిగా లభిస్తుంది. ముఖ్యంగా ఖమ్మం, నల్లమల అడవులు, శ్రీశైలం, విశాఖ అటవీ ప్రాంతాల్లో గమ్‌కరియా దొరుకుతోంది. కరియా చెట్టు బెరడు నుంచి సేకరించే గమ్ (జిగురు) పదార్థాన్ని సేకరించి దీనిని శుద్ధి చేసి ప్రత్యేక ప్యాకేజీగా సిద్ధం చేస్తారు. ఆ తరువాత టెండర్లను పిలిచి భారీగా విక్రయిస్తారు. గిరిజనుల నుంచి కిలో గమ్‌కరియాను రూ.270 లకు జిసిసి కొనుగోలు చేస్తుంది. దీని తయారీ, రవాణా, పన్నులన్నింటితో కలుపుకుని కనీసం రూ. 400లకు పెద్ద వ్యాపారులకు సంస్థ అమ్ముతుంటుంది. ముంబాయి నుంచి వచ్చే బడా వ్యాపారులు జిసిసి ద్వారా కొనుగోలు చేసి, హైదరాబాద్, విశాఖ కేంద్రాల నుంచి దీనిని తీసుకువెళ్తుంటారు. ఈ విధంగా ముంబాయికి చేరుకునే గమ్‌కరియాను అమెరికా, కెనడా, రష్యా, చైనా, ఇంగ్లాండ్, న్యూజిల్యాండ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. గమ్‌కరియా సేకరణకు సీజన్ అంటూ ఉండదు. సంవత్సరంలో ప్రతిరోజు దీనిని సేకరించవచ్చు. అయితే చెట్టు బెరడు నుంచి సున్నితంగా జిగురును సేకరించాల్సి ఉంటుంది. ఏమాత్రం బెరడను పూర్తిగా తొలగించినా కరియా చెట్టు నాశనమయ్యే ప్రమాదం ఉంది. దీని ద్వారా ఏడాదికి దాదాపు పది కోట్ల మేర ఆదాయాన్ని జిసిసి రాబట్టగలుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The chess games of bodda pratyusha
Chiranjeevi punch dialogues in allagadda campaign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles