Former tdp rajyasabha mps future course of actions

former tdp rajyasabha mps future course of actions

former tdp rajyasabha mps future course of actions

15.gif

Posted: 05/27/2012 04:32 PM IST
Former tdp rajyasabha mps future course of actions

       టీడీపీని నిశితంగా గమనిస్తే ఓ గమ్మత్తైన విషయం విశదమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినది మొదలు ఇప్పటిదాకా ఆపార్టీ తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికనై వారు పదవీ కాలం ముగిశాకా పార్టీకి దూరమవుతున్నారు. ఎన్టీఆర్ మొదలు ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు హయాం వరకు ఏదో రూపంలో పార్టీ వీడుతున్నారు.13 తాజాగా ఎంవీ మైసూరారెడ్డి ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. అభివృద్ధి కోసం పనిచేయాల్సిన నేతలు పదవి కాలం పూర్తి కాగానే ఇతర పార్టీల్లోకి వలసలు వెళ్తున్నారని టీడీపీ వర్గాలు మథనపడుతున్నాయి.  టీడీపీ తరపున రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసిన సినీనటి జయప్రద పార్టీని వీడి సమాజ్ వాదీ పార్టీలో కొనసారు. ప్రస్తుతం ఆపార్టీకి కూడ దూరమై, రాష్ట్ర రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన రుమాండ్ల రామచంద్రయ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల సందర్భంగా టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరారు. 1994లో సినీ నటుడు మోహాన్ బాబును రాజ్యసభకు పంపింది. ఎన్ టి ఆర్ పై వైస్రారాయ్ లో తిరుగుబాటు చేసి చంద్రబాబు పక్షాన చేరారు. తర్వాత మోహాన్ బాబు పార్టీకి దూరమై వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా ఆయనకు దగ్గరయ్యారు.14
      మెంటె పద్మనాభం, ఎర్రా నారాయణస్వామి కూడ రాజ్యసభ పదవీ కాలం పూర్తి కాగానే వివిధ కారణాలతో పార్టీకి దూరమైనవారే. అటు కడప జిల్లాకు చెందిన సి. రామచంద్రయ్య రాజ్యసభ పదవీకాలం పూర్తి కాకుండానే ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి పీఆర్పీలో చేరారు. మెదక్ జిల్లాకు చెందిన సోలిపేట రామచంద్రారెడ్డి, రామమునిరెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన యలమంచిలి శివాజీ  పార్టీకి దూరమైన వారే. చిత్తూరు జిల్లాకు చెందిన ఎంపి దుర్గ కూడ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.  తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వంగా గీత రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసి టిడిపికి గుడ్ బై చెప్పి  పీఆర్పీలో చేరారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. మహాబూబ్ నగర్ జిల్లాకు చెందిన పుట్టపాగ రాధాకృష్ణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి కళావెంకట్రావు టిడిపిని వీడి పిఆర్పీలో చేరారు. కళా వెంకట్రావ్ తిరిగి టీడీపీలో చేరారు. మొత్తానికి పార్టీ నుంచి పార్లమెంట్ రాజ్యసభకు ఎన్నికై పదవీ కాలం పూర్తయ్యాక మరో పార్టీలకు జంప్ చేసిన వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో రాజ్యసభ పదవి ఆపార్టీకి ‎కలిసి రావడం లేదని తాజాగా మైసూరారెడ్డి పరిణామాలో టీడీపీ నేతలు ఆలోచనలో పడ్డారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former minister mopidevi venkata ramana in care hospital today
Army recruitment rally  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles