Relief new for andhra pradesh people

relief new for andhra pradesh people

relief new for andhra pradesh people

11.gif

Posted: 05/27/2012 03:04 PM IST
Relief new for andhra pradesh people

     5 ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త. త్వరలోనే రాష్ట్రాన్ని రుతుపవనాలు పలుకరించబోతున్నాయి. అయితే.. నిన్నా ఇవాళా ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఛత్తీస్ గఢ్  నుంచి తమిళనాడు వరకు కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి కారణంగా పశ్చిమదిశ నుంచి వీచే వేడిగాలులు దిశమార్చుకోవడంతో ఉత్తర కోస్తా వాసులకు ఉపశమనం కలిగింది. అయితే దక్షిణకోస్తాలో మాత్రం మరో రెండు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కోస్తా కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరీంనగర్ జిల్లా రామగుండంలో 47.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరో పది రోజుల్లోగా రాష్ట్రానికి రుతుపవనాలు పలుకరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Praja shanti party chief ka paul says
Chandrababu naidu calculations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles