టీనేజ్‌లో ఉన్న పిల్లలు అస్తమానూ ఫోన్లో మాట్లాడుతుంటారు. 'ఎవరితో' అని ప్రశ్నిస్తే 'ఫ్రెండ్‌తో' అని చెప్పి ఊరుకుంటారు. వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో అని తల్లిదండ్రులకు బెంగ. బ్రిటన్‌కు చెందిన బెమిలో అనే సెల్‌ఫోన్ కంపెనీ ఈ బెంగలన్నింటినీ తీర్చేసే సర్వీస్ అందిస్తానంటోంది. 8-16 ఏళ్ల మధ్య పిల్లలకు ఈ సర్వీసులను ఆ సంస్థ ఆఫర్ చేస్తోంది. ఈ సర్వీస్ ఉన్న ఫోన్లను పిల్లలకు ఇస్తే.. ఫోన్ వినియోగంపై తల్లిదండ్రుల నియంత్రణ ఉంటుంది.
వారు ఎవరితో మాట్లాడొచ్చు, ఎవరికి మెసేజ్‌లు పంపొచ్చు వంటి విషయాలను కంట్రోల్ చేయవచ్చు. అవసరమనుకుంటే పిల్లల ఫోన్లను స్విచాఫ్ చేసే అవకాశం కూడా తల్లిదండ్రులకు ఉంటుంది. ఈ సర్వీసు కావాలనుకున్న వారు బెమిలో వెబ్సైట్లోకి వెళ్లి ఆప్షన్లను సెట్ చేయడం ద్వారా పిల్లల ఫోన్లను నియంత్రించే వీలుంటుంది.
పిల్లలు కొత్తగా ఏదైనా నెంబర్‌ను తమ కాంటాక్ట్ లిస్టులో చేర్చుకోవాలన్నా.. తల్లిదండ్రులు సైట్లో అనుమతించాల్సిందే. ఆ ఫోన్‌కి వచ్చే, ఆ ఫోన్ నుంచి వెళ్లే సూక్ష్మసందేశాలన్నింటినీ పేరెంట్స్ వెబ్సైట్లో చూడొచ్చు. తమ ఫోన్‌కి వచ్చిన ఎస్సెమ్మెస్‌లను పిల్లలు డిలీట్ చేసినా సరే.. అవి వెబ్సైట్లో కనిపిస్తాయి. టైమర్ ద్వారా నిర్ణీత వేళలను సెట్‌చేస్తే, ఆ సమయంలో ఎంత ప్రయత్నించినా ఫోన్ ఆన్కాదు. మన దేశంలో ఇలాంటి సర్వీసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more