ప్రస్తుత కాలంలో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ హవా ఏపాటిదో మనకు తెలుసు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్(28) ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు ప్రిస్ సిల్లా చాన్(27)ను శనివారం వివాహమాడారు. కాలిఫోర్నియాలోని తన నివాసంలో వీరి పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని జుకర్ బర్గ్ తన పేస్ బుక్ పేజీలో వెల్లడించారు. పెళ్లి ఫోటోను కూడా అప్ డేట్ చేశారు.
ఈ పెళ్లి పొటోను మొదటి అరగంటలోనే 1,31,000 మంది నెటిజన్లు వీక్షించడం విశేషం. జుకర్ బర్గ్ ముదురు నీలం రంగు సూటు, తెల్ల చొక్కా, టై ధరించగా, చాన్ స్లీవ్ లెస్ లేసెడ్ తెల్లటి పెళ్లి గౌనులో మెరిసింది. హార్వర్డ్ వర్సిటీలో పరిచయమైన వీరు గత తొమ్మిదేళ్లుగా కలిసుంటున్నారు. ఫేస్ బుక్ ఐపీఓకు వెళ్లిన తర్వాత రోజే జుకర్ బర్గ్ పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇదే వారంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి చాన్ మెడిసిన్ లో గ్రాడ్యయేషన్ పట్టా అందుకున్నారు. చాన్ వైద్య పట్టా అందుకున్న రోజున జుకర్ బర్గ్ తన పేస్ బుక్ పేజీలో 'నిన్ను చూసి గర్విస్తున్నాను డాక్టర్ చాన్' అంటూ సందేశం పోస్ట్ చేశారు. మరోవైపు పెళ్లైన వెంటనే ఫేస్ బుక్ లో తమ మ్యారేజ్ స్టేటస్ ను జుకర్ బర్గ్, చాన్ అప్ డేట్ చేశారు. వీరికి ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు వచ్చిపడుతున్నాయి.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more