Rtc volvo bus fire accdent

RTC volvo bus fire accdent

RTC volvo bus fire accdent

volvo.gif

Posted: 05/14/2012 11:27 AM IST
Rtc volvo bus fire accdent

RTC volvo bus fire accdent

చూస్తుండగానే బస్సు మొత్తం మంటలు వ్యాపించడంతో ప్రయాణికులంతా హాహాకారాలు చేశారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసు కుంది. కైతాపురం సమీపంలో తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై ఓల్వో బస్సు, టిప్పర్ ఢీకొని డ్రైవర్ సహా మరో ప్రయాణికురాలు సజీవ దహనమయ్యారు. కైతాపురం నుంచి కంకర లోడుతో చౌటుప్పల్ వైపు వెళ్తున్న టిప్పర్‌ను వెనక నుంచి అతివేగంగా వచ్చిన ఓల్వో బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుభాగంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి, డ్రైవర్ చిన్నా(37), ఆ వెనక సీటులోనే కూర్చున్న ఓరుగంటి శారద(40) అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. బస్సు నుంచి బయటపడే ప్రయత్నంలో మరో 20 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నంచేశారు. క్షతక్షిగాతులను అంబుపూన్సుల్లో చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోవడంతో రోడ్డుకిరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కాగా, అంజన ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఈ ఓల్వో బస్సు ఈసీఐఎల్ నుంచి 40మంది ప్రయాణికులతో రాత్రి 7:30 గంటలకు ఏలూరుకు బయల్దేరింది. ఘటనలో మృతిచెందిన డ్రైవర్ అమలాపురం వాస్తవ్యుడు కాగా, శారద ఏలూరు సమీపంలోని సత్రంపాడు నివాసి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy fire on y s jagan
Mothers day special story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles