విశాఖ జిల్లా పెందుర్తి మండలం పాపయ్యరాజుపాలెంలో దారుణం జరిగింది. ఇద్దరు యువతులపై నలుగురు యువకులు సామూహికంగా అత్యాచారం చేశారు. పుట్టిన రోజు పేరుతో ఆ నలుగురు యువకులు ఈ ఇద్దరు యువతులను పిలిచి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పారారీలో ఉన్నారు. పోలీసుల అదుపులో శ్రీకాంత్, అచ్చిరాజు అనే యువకులు ఉన్నారు. శ్రీకాంత్ బ్రెయిన్ బాక్స్ కంప్యూటర్ సంస్థను నడుపుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఒక కంప్యూటర్ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు యువతులపై ఆ సంస్థ యజమానితోపాటు మరో ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతులను రాత్రి ఒక గదిలో నిర్బంధించి, ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. విశాఖపట్నం చినముషిడివాడలోని పాపయ్యరాజుపాలెంలో ఉంటున్న దాబరిక శ్రీకాంత్(38) బ్రెయిన్‌బాక్స్ పేరిట కంప్యూటర్ సంస్థను నడుపుతున్నాడు. ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తిచేసిన యువతులు ఉద్యోగంలో చేరారు. కొన్నాళ్లు సక్రమంగా జీతాలు చెల్లించి ఆ తర్వాత సంస్థను మూసివేశాడు.దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తనపై పోలీసులకు ఫిర్యాదుచేయడంతో యువతులపై శ్రీకాంత్ కక్ష పెంచుకున్నాడు.
వారం క్రితం వారికి ఫోన్‌చేసి మీకు రావాల్సిన బకాయి రూ.50వేలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని, శనివారం తన పుట్టిరోజని, ఈ సందర్భంగా తాను ఇచ్చే పార్టీకి పాపయ్యరాజుపాలెంలోని తన ఇంటికి రావాలని వారిని ఆహ్వానించాడు. ఇందుకు వారు సమ్మతించి వచ్చారు. తర్వాత, వీరిమధ్య జీతం,కమీషన్ విషయం చర్చకు వచ్చింది. దాంతో శ్రీకాంత్, అతని భార్య గీతారత్నం యువతులపై దాడి చేసి,వారిని ఒక గదిలో బంధించారు. శ్రీకాంత్, అతని బావమరిది అచ్చిరాజు,స్నేహితులైన శ్రీను, వల్లి కలిసి వారిపై అత్యాచారం చేశారు. అంతేకాక ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఈ దృశ్యాలను బయటపెడతామని బెదిరించారు. తరువాత వారిని అదే గదిలో వుంచి తాళం వేసారు.
అయితే వీరిపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకరు ఆదివారం తెల్లవారుజామున గది తాళం తీసి, వారిని ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పాడు. దీంతో యువతులు ప్రహరీగోడదూకి, రోడ్డుపైకి వచ్చారు. అక్కడ వాహనం ఎక్కి, పెందుర్తి చేరుకుని పోలీసులకు చేశారు. పోలీలసులు బాధితులను వైద్యపరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. శ్రీకాంత్, అచ్చిరాజు, శ్రీకాంత్ భార్య గీతారత్నంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు శ్రీను, వల్లీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more