Titanic passenger annie was from chhattisgarh

Titanic passenger Annie was from Chhattisgarh,Chhattisgarh, Janjgir-Champa, Titanic passenger, Miss Annie Clemmer Funk

Titanic passenger Annie was from Chhattisgarh

Titanic.gif

Posted: 04/17/2012 11:07 AM IST
Titanic passenger annie was from chhattisgarh

Titanic passenger Annie was from Chhattisgarh

యానీ క్లెమ్మర్ ఫంక్. అమెరికా మిన్నొనైట్ మిషినరీ తరపున భారతదేశంలో సేవ చేసేందుకు అడుగుపెట్టిన మొదటి మహిళ. ఆమె గురించి ఇప్పుడు, ఇక్కడ ప్రస్తావించడం వెనక 'టైటానిక్ మునక' ఉంది. సేవ చేసేందుకు భారతదేశానికి వచ్చిన యానీకి, టైటానిక్‌కి సంబంధం ఏమిటని మీకనిపించొచ్చు. యానీ ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్‌లో పాఠశాల స్థాపించి కొన్ని వేల మంది పిల్లలకి చదువు చెప్పింది. తల్లికి బాగోలేదంటూ వచ్చిన టెలిగ్రామ్ యానీని ఇంగ్లండ్ వెళ్లి టైటానిక్ ఎక్కేలా చేసింది. టైటానిక్ మునిగి వందేళ్లయిన సందర్భంగా ఆ ప్రమాదంలో మరణించిన యానీ గురించి వీడియో డాక్యుమెంటరీ ఒకటి విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా యానీ గురించి...

1874, ఏప్రిల్ 12న పెన్సిల్వేనియాలోని బాలీలో జన్మించింది యానీ. మిన్నొనైట్ మిషనరీకి చెందిన ఆమె పూర్వీకులు 1700 సంవత్సరంలో జర్మనీ నుంచి అమెరికాకి వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. యానీ తండ్రి మిన్నొనైట్ చర్చి పెద్దగా పాతికేళ్లు పనిచేశాడు. యానీ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత 'చట్టనూగా' మురికివాడల్లో నివసిస్తున్న వాళ్ల కోసం పనిచేసింది. అలా పనిచేస్తున్నప్పుడే మిషనరీలో పనిచేయాలని నిర్ణయించుకుంది. 1906, డిసెంబర్‌లో మిషనరీ తరపున సేవ చేసేందుకు భారతదేశానికి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్‌కి వచ్చిన యానీ 1907, జూలై నెలలో అమ్మాయిలకు చదువు చెప్పే స్కూల్‌ను ఒక గదిలో ప్రారంభించింది.

Titanic passenger Annie was from Chhattisgarh

అలా 17 మంది అమ్మాయిలతో స్కూల్ మొదలయ్యింది. ఐదేళ్లు అక్కడే ఉంది. హిందీ నేర్చుకుని ఆ ప్రాంత ప్రజలతో కలిసిపోతున్న ఆమెను "అమ్మ ఆరోగ్యం బాగోలేదు. ఒకసారి ఇంటికి రా'' అంటూ వచ్చిన టెలిగ్రామ్ స్వస్థలానికి బయల్దేరదీసింది. టెలిగ్రామ్ అందుకున్న యానీ రైల్లో, నౌకలో ప్రయాణించి ఇంగ్లాండుకు చేరుకుంది. అక్కడ్నించి లివర్‌పూల్ వెళ్లి హావర్‌ఫోర్డ్ షిప్‌లో అమెరికాలో ఉన్న తన ఇంటికి చేరుకోవాలామె. అయితే సమ్మె కారణంగా బొగ్గు లేకపోవడంతో ఆ షిప్ కదల్లేదు. దాంతో టైటానిక్ ఎక్కాల్సి వచ్చిందామెకు. పదమూడు డాలర్లతో సెకండ్ క్లాస్ టికెట్ కొనుక్కుని సౌతాంప్టన్‌లో టైటానిక్ షిప్ ఎక్కింది.

టైటానిక్ మునగడానికి మూడురోజుల ముందు యానీ షిప్‌లోనే తన 38వ పుట్టినరోజును చాలా గ్రాండ్‌గా జరుపుకుంది. షిప్ మునిగిపోయిన రాత్రి తన క్యాబిన్‌లో నిద్రపోతున్న యానీని స్టీవార్డ్స్ నిద్రలేపి డెక్ మీదకు చేర్చారు. లైఫ్‌బోట్ ఎక్కబోతున్న ఆమెకు వెనక నుంచి 'నా పిల్లలు నా పిల్లలు' అంటూ కంగారుగా అరుస్తూ వస్తున్న ఒక తల్లి కనిపించింది. బహుశా ఆమె పిల్లలు ఆ బోట్‌లో ఉన్నారు కాబోలు. ఆ లైఫ్‌బోట్‌లో ఒక్క సీటే ఉండడంతో ఆ సీటు ఆమెకి ఇచ్చేసి టైటానిక్‌తో పాటు మునిగిపోయి ప్రాణాలు పోగొట్టుకుంది యానీ. ఆమె జ్ఞాపకార్థంగా భారతదేశంలో ఆమె ఏర్పాటుచేసిన పాఠశాలకు 'యానీ ఫంక్ మెమోరియల్ స్కూల్' అని పేరు పెట్టారు. 'రిమంబరింగ్ యానీ ఫంక్' పేరుతో 35 నిమిషాల నిడివి గల వీడియో త్వరలో విడుదలకానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Who is the best cook your mother or your wife
Jeep brake problem  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles