అమ్మ చేతి వంటకు సాటి లేదు. అందరికీ తెలిసిన విషయమే. అందరూ ఒప్పుకునే విషయమే. అయితే పెళ్లయిన అబ్బాయి దగ్గరికి వెళ్లి 'మీకు మీ అమ్మ చేసిన వంటలంటే ఇష్టమా? మీ భార్య చేతి వంటలంటే ఇష్టమా...?' అని అడిగితే ఏం చెబుతాడు. టక్కున సమాధానం రావడం కష్టమే. ఈ అంశం మీద సర్వే చేయడానికి ఇంగ్లండ్‌లోని ఓ టీవీ చానెల్ వారు మైకు తీసుకుని బయలుదేరారు. రెండు వేలమంది మగవాళ్ల దగ్గరకు వెళ్లి 'మీకు ఎవరి చేతి వంటంటే ఇష్టమని' అడిగారు. అరవైశాతం మంది 'మాకు మా అమ్మ చేతి వంటంటేనే ఇష్టమని' చెప్పారు. ఆ సమాధానంతో ఊరుకోకుండా ఆ ఛానెల్ వారు కెమెరా కాస్త జూమ్ చేసి కారణాలు కూడా అడిగారు. "అమ్మ చేసే వంట సంప్రదాయ బద్ధంగా ఉంటుంది. నా భార్య ఎన్ని కొత్త రకాల వంటలు వండినా నా మనసు మాత్రం అమ్మ వండే వంటలమీదే ఉంటుంది. అమ్మ కొత్త వంటలేమీ వండదు.
అయితే చేసే నాలుగూ చాలా రుచిగా చేస్తుంది'' అని చెప్పారు కొందరు అబ్బాయిలు " మా అమ్మ వండే వంటలకు, నా భార్య చేసే వంటలకు అస్సలు పోలికే ఉండదు. ఒకరి రుచులు ఒకరికి నచ్చవు కూడా. వెరైటీల విషయంలో నా భార్య చాలా ప్రయత్నాలు చేస్తుంది. కాని నాకు మా అమ్మ చేతి వంటే నచ్చుతుంది. అది ఎంత సింపుల్ వంటైనా చాలా టేస్ట్‌గా ఉంటుంది'' అని 47 శాతం మంది మగవారు చెప్పారు. "నేను ఇద్దరి వంటలూ బాగుంటాయనే చెబుతాను. కాని మార్కులు వేయాల్సి వస్తే అమ్మ వంటకే జై కొడతాను. అప్పుడప్పుడు అమ్మ చేతి వంట రుచి గురించి నా భార్యకు చెబుతుంటాను. అమ్మ దగ్గర కొన్ని టిప్స్ తెలుసుకోమని కూడా సలహా ఇస్తుంటాను'' అని 13 శాతం మంది చెప్పారు. "అమ్మ దగ్గర వంట నేర్చుకోమని చెబితే ఇంకేమయినా ఉందా...ఇంట్లో యుద్ధాలు జరిగిపోతాయి. అలాంటి సాహసాలు మేమెప్పుడూ చేయలేదు'' అని అన్నారు మరికొందరు. ఇలా తమ వంట చాయిస్ గురించి చెబుతూ ఇంటి బాధలను కూడా పంచుకున్నారు యుకె అబ్బాయిలు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more