Ntr and pawan kalyan fans dispute

ntr and pawan kalyan fans dispute

ntr and pawan kalyan fans dispute

555.gif

Posted: 04/15/2012 07:58 PM IST
Ntr and pawan kalyan fans dispute

              సరదా సరదాగా సాగాల్సిన సినిమా హీరోల మీద అభిమానం కట్టలు తెంచుకుంటే ఇదే జరిగేది. హీరోలు ఫ్యాన్స్ ని కొట్టుకు చావమని అనరుకదా.. ఎందుకీ వెర్రి చేష్టలు. తెలిసీ తెలియని వయసులో చేసే పొరపాట్లు. ఫలితంగా, అభిమానం హద్దులు దాటితే ఏమవుతుందో విజయవాడలో మరోసారి తాజాగా, నిరూపితం అయింది.
              విజయవాడ గొల్లపూడి ప్రాంతంలోని NRI కాలేజ్ లో యన్టీఆర్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య ఈరోజు ఘర్షణ చోటు చేసుకుంది. యన్టీఆర్ 'దమ్ము', పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమాల విషయంలో వాదోపవాదాలు వివాదానికి దారితీశాయి. దాంతో విద్యార్ధులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో పలువురు విద్యార్ధులు స్వల్పంగా గాయపడ్డట్టు తెలుస్తోంది.  తమ అభిమాన నటుల కటౌట్ల విషయంలో నెలకొన్న వివాదం ఈ ఘర్షణకు దారితీసినట్టు తెలుస్తోంది.
              దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, వివాదానికి కారకులైన ఇరవై మంది విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు. ఓపక్క పవన్ కల్యాణ్, యన్టీఆర్ పలు ఫంక్షన్లలో కలిసినప్పుడు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ స్నేహంగా వుంటుంటే... మరోపక్క వాళ్ల అభిమానులు ఇలా ఘర్షణ పడడం ఏమి సబబు ఆలోచించాలి. అంతా ఈ తరహా వివాదాలు ఆయా హీరోలకు కూడా మనస్థాపాన్ని కలిగిస్తాయన్న విషయాన్ని ఫ్యాన్స్ గుర్తుంచుకోవాలి.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Drug rocket in hyderabad
Producer tammareddy bharadwaja says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles