Dental x rays linked to brain tumors

Dental X-rays linked to brain tumors.GIF

Posted: 04/11/2012 06:38 PM IST
Dental x rays linked to brain tumors

Dental-X-rayమీకు ఏదైనా దంత సమస్య ఉంటే మాటి మాటికి ఎక్స్ రే తీసుకుంటున్నారా ? అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పంటి ఎక్స్ రే తో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దంతాలను తరచూ ఎక్సరే తీయించుకోవడం ఆరోగ్యానికి చేటు చేస్తుందని, దానికి వీలైనంత దూరంగా ఉండాలని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువసార్లు డెంటల్ ఎక్స్‌ రే తీసుకునే వారిలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ముప్పు రెండు రెట్లు పెరుగుతుంద ని తమ అధ్యయనం ద్వారా తేల్చారు.

యేల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిపుణుల బృందం దీనిపై పరిశోధన జరిపింది. దంత ఎక్సరేల వల్ల 'మెనింజియోమా' అనే కేన్సర్ రహిత బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం సాధారణ వ్యక్తులకన్నా 1.4 నుంచి 1.9రెట్లు అధికంగా ఉంటుందని, పదేళ్లలోపు వారికి ఎక్సరేలు తీస్తే ఈ ముప్పు 4.9రెట్లు పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వేలాది మందిపై అధ్యయనం జరిపిన తర్వాత ఈ విషయన్ని ద్రువీకరించినట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Watch for cheating in exam
London most beautiful city of the world  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles