Watch for cheating in exam

Watch for cheating in exam,Watch for cheating on exams products, sachin, student, B,Com, Student,

Watch for cheating in exam

cheating.gif

Posted: 04/11/2012 06:47 PM IST
Watch for cheating in exam

Watch for cheating in exam

భారతి డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్న జేతి సచిన్ అనే విద్యార్థికి ఏవీవీ కళాశాల పరీక్షా కేంద్రంగా పడింది. ఈ-కామర్స్ పరీక్ష రాసే సమయంలో సచిన్ పదేపదే తన చేతికున్న వాచ్‌ను చూసుకుంటుండడంతో విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన పరిశీలకుడు సంతోష్‌కు అనుమానం వచ్చింది. దీంతో ఆయన సచిన్ చేతికున్న వాచీని పరిశీలించాడు. ఆయన షాక్ తిన్నాడు. సచిన్ చేతికున్న వాచీ మాముల్ వాచీ కాదు? అది ఐపాడ్ వాచ్‌గా ఆయన గుర్తించారు. ఈ కామర్స్ పాఠ్యపుస్తకంలో ఉన్న సమాచారమంతా అందులో ఉంది.

టెక్నాలజీని మంచికీ వాడవచ్చు, చెడుకూ వాడవచ్చునని ఓ విద్యార్థి రుజువు చేశాడు. పాఠ్యపుస్తకం మొత్తాన్నీ సాఫ్ట్‌కాపీ రూపంలో వాచీలోకి ఎక్కించేసుకుని పరీక్ష హాలుకు వెళ్లాడు. దాని నుంచి కాపీ కొడుతు అతను పట్టుబడ్డాడు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏవీవీ కళాశాల పరీక్షా కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

దాని సహాయంతో సచిన్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు జవాబులు రాస్తున్నట్టు సంతోష్ గ్రహించారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి, యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాపీ కొడుతున్నందుకు ఆ విద్యార్థిపై కేసు బుక్ చేసి హాల్‌టికెట్ తీసుకుని పంపించారు.సచిన్ వినియోగించిన వాచ్ విలువ రూ.25వేలు. చూడ్డానికి మామూలు చేతిగడియారంలా కనిపించే దీని సామర్థ్యం 32 జీబీ. ఇందులో సంగీతం, సినిమాలతోపాటు వెయ్యికిపైగా పుస్తకాలను నిక్షిప్తం చేయవచ్చు. మనకు కావాల్సిన పుస్తకాలను స్కాన్ చేసి ఈ చిప్‌లో ఇన్‌స్టాల్ చేసి ఎప్పుడైనా తెరిచి, టచ్ స్క్రీన్ ద్వారా చదువుకోవచ్చు.

సచిన్ చేసింది కూడా ఇదే. ఈ-కామర్స్ పాఠ్యపుస్తకాన్ని ప్రశ్నలు, జవాబుల రూపంలో ఐపాడ్‌లోకి నిక్షిప్తం చేసుకున్నాడు. వెలుతురులో ఇందులో ఏముందో పైకి కనిపించదు. కానీ, వెలుతురు తక్కువగా ఉన్న గదిలో ఇందులో ఉన్న సమాచారం అంతా స్పష్టంగా కనిపిస్తుంది. దాని సహాయంతో కాపీ కొడుతూ సచిన్ దొరికిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tara chowdary says acp harrashed me
Dental x rays linked to brain tumors  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles