No telangana heat for jagan in sangareddy

No Telangana heat for Jagan in Sangareddy,YSR Congress president YS Jaganmohan Reddy faced no opposition from TRS cadres during his visit to Sangareddy,Jagan Mohan Reddy, YSR Reddy, Congress, Andhra Pradesh, Botsa Satyanarayana

No Telangana heat for Jagan in Sangareddy

Sangareddy0100.gif

Posted: 04/10/2012 07:05 PM IST
No telangana heat for jagan in sangareddy

No Telangana heat for Jagan in Sangareddy

గత నెల 29న సంగారెడ్డిలో జరిగిన అల్లర్లలో ధ్వంసమై న ఆస్తులను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. మూడు గంటల పాటు జరిగిన జగన్ పర్యటన ఆద్యంతం సెక్యూరిటీ సిబ్బంది హడావిడి అంతా ఇంతా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జగన్మోహన్‌రెడ్డి మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిపిన పర్యటనలో.. ఆయన భద్రతా సిబ్బంది దుందుడుకు చేష్టలు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. ఈ తోపులాటతో కంగుతిన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టి జగపతి, పార్టీ జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి దూరంగా ఉండిపోయారు. నిజానికి జగన్ వీరిద్దరినీ వెంటబెట్టుకునే బాధితులను పరామర్శించాల్సి ఉంది. అయితే, తోపులాటల వల్ల వీరు దూరంగా ఉన్నా జగన్ వారిని దగ్గరకు పిలిచే యత్నం చేయలేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తోసుకుంటూ రావడంతో వారందరిని సెక్యూరిటీ సిబ్బంది ఎడాపెడా తోసేశారు. 

ఈ హోటల్‌లోనే.. తోపులాటల వల్ల కూల్‌డ్రింక్ సీసాలు పగిలి పలువురికి గాయాలయ్యాయి. జగన్‌ను చూసేందుకు హోటల్ బయట గుమిగూడిన వారిని సెక్యూరిటీ సిబ్బంది తోసేసుకుంటూ వెళ్లారు. ఇక్కడే ఒక బాలుడి చెంపను సెక్యూరిటీ సిబ్బంది చెళ్లుమనిపించడంతో అతను ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు. ఇక, ఈ పర్యటనను కవర్ చేసేందుకు వెళ్లిన విలేకరులను సైతం జగన్ సెక్యూరిటీ సిబ్బంది వదలలేదు. "ఏమి రాస్తారు? రాయకపోతే ఏమవుతుంది? అంటూ విలేకరులను సైతం తోసేశారు. పాత బస్టాండ్ సమీపంలో ధ్వంసమైన హోటల్‌ను చూసేందుకు వెళ్లిన జగన్ సంఘటన వివరాల గురించి పావుగంటసేపు అడిగి తెలుసుకున్నారు. కానీ హోటల్‌లో జరిగిన నష్టాన్ని చూడలేకపోయారు. సెక్యూరిటీ సిబ్బంది హడావిడి చూసి, స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు లాఠీలకు పని చెప్పారు.  

No Telangana heat for Jagan in Sangareddy

దాంతో పోలీస్ అధికారి ఒకరు జగన్ వద్దకు వెళ్లి ట్రాఫిక్‌కు ఇబ్బందులవుతున్నాయని, పరామర్శ త్వరగా ముగించండని కోరారు. తాను చూసేందుకు రాలేదని, బాధితుల కష్టాలు వినేందుకు వచ్చానని, ట్రాఫిక్‌కు ఇబ్బందులవుతే కానీ అంటూ జగన్ తన పర్యటనను కొనసాగించారు. తోపులాటల నేపథ్యంలో.. అదే అదనుగా జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcns finalises preliminary recommendations on us ties
Ys rajasekhar reddy may also likely to sent jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles