Ys rajasekhar reddy may also likely to sent jail

late YS Rajasekhar Reddy may also likely to sent jail if he is alive. He accused, YSR Congress Party chief YS Jaganmohan Reddy get crores of rupees with Congress name

late YS Rajasekhar Reddy may also likely to sent jail if he is alive. He accused, YSR Congress Party chief YS Jaganmohan Reddy get crores of rupees with Congress name.

YS Rajasekhar Reddy may also likely to sent jail.gif

Posted: 04/10/2012 06:49 PM IST
Ys rajasekhar reddy may also likely to sent jail

Anam-vivekananda-reddyమొన్నటి వరకు కించిత్తు మాట కూడా అనని కాంగ్రెస్ పార్టీ నాయకులు మెల్లి మెల్లగా వైయస్ రాజశేఖర్ రెడ్డి పై తన వాక్బాణాలను వదులుతున్నారు. గత కొన్ని రోజులను నుండి ఈ విమర్శల జోరు పెంచారు. తాజా నేడు నెల్లూరు జిల్లాకు చెందిన శాసన సభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి, బొత్స సత్యనారాయణలు వైయస్ పై వేరు సంఘటనల్లో విమర్శలు చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు బత్రికుంటే ఇప్పుడున్న అవినీతి ఆరోపణలు నిజమైతే... వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా జైలు పాలు అయ్యేవాడని ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. తాము కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వారసులం అని, వైయస్ కి కాదని అన్నారు. తండ్రీ కొడుకులు పార్టీ పేరు చెప్పుకొని లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. జగన్ కాంగ్రెస్ పేరు చెప్పుకొని సంపాదించుకొని ఇప్పుడు కాంగ్రెస్ ని విమర్శిస్తున్నాడని, అతని తీరు తల్లి పాలు తాగి రొమ్ముని తన్నే విధంగా ఉందని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే చేతులు కట్టుకొని ఊరుకోమని, అవినీతికి పాల్పడిన ఎంతటి వారినైనా కాంగ్రెస్ పార్టీ వదలదని జగన్ ని ఉద్దేశించి అన్నారు. అవినీతి పరులైన సురేష్ కల్మాడీ, కనిమొళి లాంటి వాళ్లనే జైలుకు పంపించన కాంగ్రెస్ కి జగన్ కూడా పంపిస్తుందని అన్నారు.

ఇక పీసీసీ ఛీఫ్ బొత్స కూడా వైయస్ ని విమర్శించాడు. వైయస్ తన సొంత ఆలోచనలతోటి ఏ పథకాలు సంక్షేమ పెట్టలేదని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచనల మేరకే వైయస్ పథకాలు ప్రారంభించారని కడప జిల్లాలో అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో తాము ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు అందించిన ఘనత కాంగ్రెసుదే అన్నారు. అంతే కాకుండా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎపి కాంగ్రెస్ నాయకులకు వైయస్ కావాలా, సోనియా కావాలా నిర్ణయించుకోవాలని చెప్పారు.
మరి వీరందరి తీరు చూస్తుంటే ఉప ఎన్నికల లోపు వైయస్ పేరును పూర్తిగా మట్టికరించే పనిలో ఉన్నారని వైయస్సాపీ పార్టీ నాయకులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No telangana heat for jagan in sangareddy
Sonipat teacher killed for not allowing cheating  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles